Friday, March 13, 2026

 6 February 2018

 
Shared with Friends
-----------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------
పురోగతిలోమనిషి ఎక్కిన మెట్లన్నీ
తన పూర్వీకులు పరచిన నిచ్చనవే!
సమకాలీనసమాజంలో వికాసతరంగాలన్నీ
'పునర్నవశోభిత వనసౌగంధిక' పరిమళాలే
శాస్త్రమూ తత్వమూ తెలియని మనిషీ;
నీవూ, నీతోడి పరివారమూ అడవికాచిన పుష్పాలు!
విడమరచి చెప్పే వుగ్గుపాలేవీ? పాపం,
మళ్ళీ పసి దశలోకి ప్రవహించిపోతోందికదూ,
పరువంలోకొచ్చిన, నీ 'ధీమహిమాగాయత్రి'!
త్రిగుణాలూ, త్రికరణాలూ కలతబడ్డాయి.
కానైతే, ఏదో ఒకరోజు విశ్మృతీ,వుక్రోషం
విప్పే 'వైషమ్యవికారాల వూబి'లో దిగబడుతూ
నీతోటివారినీ నీటముంచైనా వేస్తావు.,
విషమపురుషలో 'విపరీతాల తోకచుక్కలు'
విరజాజులపూదోటల్లో 'వుల్కాపాత'మవుతున్నాయి.,
ఏంచేద్దామనుకుంటున్నావ్, 'నీ అంతర్వేదనలో'.,
మైకంవదలి మళ్ళీ ఆకాశపుఔన్నత్యంలోకి
తొంగి చూద్దామనే అనుకుంటున్నావా?,
ఐతే, వేయిపడగలనీ, కోటికిరణాలనీ చూడు.,
ఎక్కడా?, చీకటి జీముతంలో చిక్కుకున్న
సహస్రకోటి జీవుల్లో జీవిక అంచున డేకుతున్న
చావుకొచ్చిన సంస్కారహీనుల్లో,
ఏమో, ఏ 'కొడిగట్టిన వత్తి'లోనో సంజీవని
అంతర్వాహినిగా ప్రవహిస్తూండవచ్చు!!

No comments:

Post a Comment