·
Shared with Friends
మొగము తెల్ల కాగితమైనది
మది తలపులు రాలి మోడైనది
ప్రాణనిర్వాణ గంధము
నాశికల తాకి మరపు వెరపుల
మాటల పాటలములొలుకజొచ్చె
అబల నోటిన శృతితప్పిన మతి పాటగ
ఆహా ముందు నూయి వేనుకగోయి
అన్న చాటువెంత సత్యమూ
తమ్ముడు తనకు కాదు
అక్క సెల్లెండ్రు తనకు రారు
చుట్టముల కట్టడి సత్య
హరిశ్చంద్ర శోధక నక్షత్రకములే
పోయెడి ప్రాణములాపు శక్తి
వెంకటాచలపతి ఈయగలడేమొ
మొక్కు తీర్చెద స్వామి దారిజూపుమనును
మామలొత్తురేమొ తండ్రులొత్తురేమొ
వ్రేలిమోల కారుచీకటిన దివ్వెలౌదురేమొ
పరితపించుచున్నొదొ పరిపరి విధముల
అన్నది అనుచున్నదొ మొగని మేల్కొమ్మని
జారిపోయిను దృక్కులప్రాణములు
అంతట వూరడించువారలెవ్వరక్కడ
కర్మచేయుటకు ఆప్తులు చేరువయ్యరేమొ
కాని కర్మ మెటులకాలునొ పిదప
కర్మచేసినతరి కర్మమొకరిది
క్రియ వేరోకరెట్లు నివేదించవలె
కాసులెక్కడవి కాని బంధము తెగినను
పెనవైచెడి ఖర్మబంధము తీర్పగ
కడు బాపమని తలచి పలువురు
నలువురైరి నలువురు నవ్వుపాల్గాక
పువ్వులు దండలుతెచ్చిరి జ్ఞాపికల
దీపముల అంపసెయ్యన సాగనంపిరి
విడివిడిగ కలివిడిగ నారోపించిరి
కారణముల గుణముల కష్టముల
నష్టముల కన్నతండ్రి,తల్లుల ప్రమేయము
మరచిరి, విలంబిత అర్ధనారీశ్వరిని
అకటా కరణకారణమని రోదించిరి
అమ్మా నీకు నువ్వు నెయ్యము గొనక
కలికాలమున తీరునె ఆకలి దప్పులు
ప్రక్ష్యక్ష పరిణామములు
పరోక్ష కారణముల క్రియకావు
నిస్తబ్దత,నిర్లిప్తత, నిర్లక్ష్యమూ
గ్రుడ్డి మూగ చెవిటి మనసుకు మరి
తోరణ పారణ విధములైనప్పుడు
తనతోడు తనహితమెరుగ నప్పుడు
తనువుకు పరహితార్ధము పెన్నిధని
తోచనప్పుడు మన భావనలో
ఎండమావులు దోబూచులాడుగద
ఔవునవును ఈమాటలు నాకు నావికావు
ఆమెవికావలె పుణ్యమూర్తులార
ప్రత్యూషన ప్రవచించెదరుగాక
ఇది తరుణమే పరమపదమునకు
తుదిపలుకగు మీదిన విరిసిన
అమృత కారుణ్యము పుణ్యవిషేషమును
తధ్యము తధ్యము చిరంజీవులార
F
No comments:
Post a Comment