వుషసున తొలగు మాయ కడునలుపది
తెలుపున వెలుగు జీవి ఒడితడుపబడి
కలిపిన యేడురంగుల కొలువు తెలుపు !
సప్తార్ణవ,సప్త కులాచల,సాప్తాయిక జన్మ
పంచభూతములు,జరామృత్యువులతోడి
యేడు, కలుగు చీకటిన కలసి ప్రాణబిందువై!
లింగమో,జంగమో,యోనియో,వ్యోమమో,
గ్లానియో,ప్లావమో,స్రావమో,వుపకారణమే!
'జరామృత్యు'రూపకరాళమునకవి గొళ్ళెముల
ఆత్మప్రాణానుకంపనమున'కవి విడువబడు వుడుపులు!
కనుగొన్న భగవద్విషయము భావాతీతమె,
మతములు,సద్యో మార్గములు,సాధనకె.,
సప్తవర్ణములు,తెలుపౌ సాధన వెలుగౌకద!
అదితెలపిన గాంగేయుడు ''శుక్లాంబరధర'మని
రామచాపమును నేలనిలపి, పాలపుంతన,
విడివడిన చాయారూపలేశముల నడయాడు,
సోమసూర్య ప్రభల వెలుగొందు,
పూర్ణకళాకోవిదుడె విష్ణు'వని మనముననెంచి,
దిక్కులె బాహువులని ఎక్కుడునెంచగ
అవ్యములంగములని,చక్కగమేనిని,
చిక్కని నలుపును మాయగనలమి,
సహస్రాధిక గుణములు గణ్యముగ
హరిపూర్ణకళారూపమని కనులార
కనుగొని, తన ప్రాణప్రజ్వలమున,
కాంచి,తరించి తనవారమౌ మనకు
చూపునిలుపులనెంచి పుణ్యాత్ముడు,
తెలివిడి జేసె' నల్లన యన వర్ణాద్వైతము,
మాయ మరి తెలియలేని మిగులు,
తెలిసిమది,తెలివిడికానిది,తెలియనిది,
తెలియరానిది,జన్మ జరా,మృత్యువులకవల,
కారణ,కరణ కారకముల,సర్వము,
బ్రహ్మమని,దానికాద్యంతములె
నారాయణడను పరి భావనచేసిన,
యాతడాద్యుడుదైవ పరికల్పనకు,
శివకేశవులబేధ్యులాద్యంతరహిత
సితాసిత రూపవిమోహ కాల కాళ,
కరాళ శ్వేతశ్వేతాంతర వర్ణార్ణవ,
ధూమధ్రుమ బ్రహ్మ పదార్ధములని,
బ్రహ్మజ్గ్నానమె సచ్చిదానందమ"ని,
విష్ణుసహస్రనామ మంత్రమునిచ్చె!
This is the original needs editing.
No comments:
Post a Comment