Friday, March 13, 2026

 aturday, 24 May 2014 at 01:54 UTC+05:30

సందడీ చేసేటి చిన్నారి బుల్లి
సందడీ చేసేటి చిన్నారి బుల్లి
ముంగిటీ ముత్యమంచు మురిసేను
అలనాటి కన్నయ్య చిన్నన్న నీకు
మురిసేటి గోపెమ్మ అమ్మమ్మ నీకు
ఆలమందలైతే కానరావు
కానీ నీలిమబ్బులూ,చందమామా
ఆనాటివాళ్ళే నెమలిపింఛాల కన్నులే
అన్నయ్య ఆనవాళ్ళూ
బుల్లీ అల్లరి చేయకు,అమ్మ అలిసేను
,నాన్న కసిరేను దోగాడు మబ్బుల్లొ
దొంగాటలాడేటి చందమామ
వూసులన్ని,అమ్మమ్మ చెప్పేను
అరిసెలూ పెట్టేను. హాయిగానిద్దురో,ని
ద్దురాలో అన్నయ్య కన్నయ్యతో ఆటలాడుకో.!!
bulli is now no more little kutti.
she knows writing reading and spesking four languages... English,Tamil,Telugu andHindi.
She paints plays many games and of course now learning karate.last time when I had been to chenai she did help me by interpreting between Tamil and english when faced an encounter with a tamil gentle man. Now she is a best friend to me along with her sister who is too big and almost nine classes ahead. I Am proud of my friendly grand children who also sing national anthem very sweetly
Posted by satya lakshmi at 5:29 AM

No comments:

Post a Comment