Friday, March 13, 2026

 Privacy

Posts

Other posts

తీరని కరవున తిండి పెట్టెనతడు
కరవు తీరిన తీరికన తిరిగి
గిరిదాటిపో చలనమతులైరిప్రజ
ఒప్పడె తాపసి గౌతముడెప్పటికి
పసికూనలపగిది కాచెను ప్రజను
మేదినివట్టిబోయినతరి కరువని యెరిగి
దున్నని పర్రన విత్తి చిత్త ప్రవృత్తిన
చిత్రముగ వండివార్చె తపసి
పుడమి యడిగే వడి వానలేక
అయ్యో నామేనిన హలమేదినాకడుపు
పండెడియాసేది యని,నంత బ్రహ్మర్షి
మనమున తలచి హల్యని నిలపె
యది తలపె కాని నవజవ్వనిగద
తలపులు తెరచిన ప్రకృతి,
అదియట్టులని ఎరిగిన జనులా
తరిని వీడి ఏకాంతముజేయగోరి
అహో వినడీతడు మఛనను మన
నిమ్మనిన జనుదము మనమే
మాయోపాయమున యని గోవును
గోముఖతీర్థమున సృజించి
సస్యముల చెరచ కల్పించిరట
యాగోవునదల్చనెంచిగరినకెత్తిన గౌతముని
గుణములుదక్కె,' కుయ్యాలించుచు
చచ్చిపడ్డా యాగోవునుపరికించి'.
అది యదనుగనెంచి,' తపము చెల్లె గౌతమ,నీదదు తపములెల్లచెల్లెనిక
పాపవిమోచనమునకై మదినతలచుము
మేదినీ ప్రియమగు నటుల వసంతములొచ్చుదాక',
యని జనిరా అతిధి వర ప్రవరులు.
అంత, గౌతముడు నిర్వికల్పమున
తన మననోద్దీపనొంది మౌని యయ్యె!
మేదిని యవతారికయైయా మునిని సేవించుచుకాల వికల్పముల మరింత చిక్కి
తా చూలుకు రాని గండపాషాణమయ్యె!
యా నేల సరణి, అట్టి ఘోరతపసాగ్నిన
బండలు వ్రయ్యలయై ధూమములుప్పుతెల్ల
మేఘుడాకసమున తిరిగి తిరిగి
కురియనెంచె ! ఎంతటికి చెల్లని
తపమా ముని గౌతమునిది
నేల యహల్యమై నెర్రెలు వారి
భూమాత గర్భక్లేశములైనంత
సహస్రయోని యతాడాకస దారిన
నిలచి పారాడు సమయమున
ఒక్కతరి సంధ్యకుపూర్వమె గిరిదప్పె
గౌతమ మనసు గౌణమున.
యదినెంచి వర్షించె తనువు తడియ
మడులు కట్టిన నేల చూలింతయయ్యె!
ముని వాటికజేరి చిత్తభ్రమకచ్చెరపడి
అహల్యా తడిసె నీమేని మేదినీ పుత్రీ
కుల్యామూలక తడిలేక చడిలేక
రామ పాద స్పర్సితవౌదనుక
ఇద్దండకారణ్య భగీరధీ తీరమున'
యని జనియె గౌతమీ తీరమువదలి!
అహల్య మానవి కాదు తప్పుచేయగ
గౌతముడు మనమున విశ్వా మిత్రుడయ్యు
మేనక చేరని మేదినీ పతియె
సంతానము నిచ్చిన దనుక
షృష్టిన రాయయ్యె ధరణి తనవు
ధరిత్రీ పుత్రులార యెంచకుడు
యహల్యామాతనన్య స్త్రీ యని
యామె పుడమి యవతారమే,
పావని యయ్యె, యా వనమానిని
తరుణసేవనకు పిమ్మట తనదు
పరివార ప్రజలకు కరువుదీర్ప
కపిలగోతీర్థముగ మారెనామె!
నమ్ముడు యామె ధరణీ ప్రసూనమె!
భాష్ప తాపముల క్రాగిన జనుల
కన్నపానీయములనిడిన
గౌతమార్యుని మన: ప్రభవానల
కుల్య యహల్యా యామె మాతలకు మాత!
శ్రీ రామ జయము జయ రామ జయ జయరామ
వ్య క్త మేష మహాయోగీ పరమాత్మా సనాతనహ:
అనాదిమధ్యనిధనో మహత:పరమోమహాన్
తమస:పరమోధాతాశంఖచక్రగదాధర:
శ్రీవత్స వక్షా నిత్యశ్రీ రజయ్యశ్శాశ్వతో ధృవ:
రాముడు మహా యోగి పరమాత్ముడు. నిత్యుడు.ఆది మధ్యాంత రహితుడు. తనగొప్పను తృణీకరించినవాడు. సహజ ఆత్మోన్ముఖుడు.సృష్టిస్తిలయములకతీతమాతని యాత్మ. శంఖచక్ర గదా ధరుడు.శ్రీ వత్స వక్షుడు.అజేయుడు శాస్వతుడనీరావణ వధానంతరము మండోదరి, రావణ
నిర్యాణ ధు:ఖమున మొత్తుకొనినది. మరియు రావణుని యుద్దేస్యించి,అనేకవిధముల ఆక్రోసించినది.సీతా సాధ్విని యామె తపహ్:పరిణామమే రావణ అవతార పరిసమాప్తి యని, పంచేద్రియ పంచభూత పంచప్రాణ రూప సమ్మోహకములందు లాశ్య విలాసములందు తన్ను మించి భౌతికానంద ప్రదాయిని సీతాసాధ్వి ఎంతమాత్రము కాదనియు, క్రోధ కామ మదమూలకముగా నీవు హతుడైనావని మిక్కిలి రోదించినది.
శ్రీరాముడు ఇంద్రియములందు ఆత్మ చేతన గల్గిన స్వామి.మహాయోగియయ్యు అసాధారణ సమ్యమనమున సాధారణమానవునిగా పరిపూర్ణ ప్రవర్తనచే ప్రవర్థిల్లినాడు. రావణుడు మహాభక్తుడయ్యు రాజసి కొండొకప్పుడు తామసి, రాగరంజిత భోగమయ జీవనమున ఇంద్రుని సాటిగా మరియు ఇంద్రియముల మించి మనసా,వసించినాడు.తన ఇంద్రియములజయించి ఇంద్రుని జయించినాడు. యమ నియమముల నాచరించి తపమున శక్తిపొంది తామసమున దిక్కుల సూర్య చంద్రుల భూచర ఖేచరముల నిరోధించినాడు. యశోగామి కాక కామీ కపటియై రాక్షసుడైనాడు. ఇచట గుణ
ప్రశస్తిన రాక్షసుడని భావము. దిశలెల్ల వ్యాపనము చెంది దశ కంఠుడైనాడు. నాభిన ప్రాణనిక్షేపణ గల్గి హృదయలయలను నిరోధించినాడు. సోహమను వూపిరి వుదాన నిక్షిప్తమై మధ్యమమైనది. ఇది ఇతిహాసమయ్యు మిక్కిలి సజీవ సాభిప్రాయ పారమార్ధిక చింతనా ఘట్టము. వల్మీకము వదలిన అత్యద్భుత సుందర కాలసర్పము రావణ నిర్యాణము సమాప్తము చేసిన విధము వర్ణించినది. రావణ ప్రాణ నిహిత మండోదరిYఎ,యెట్లన తన ఆధ్యాత్మికతా పాతివ్యత్వ సీలతన తను నిగ్రహించ గలదయ్యు ధర్మ పక్షమున నిలచి సర్వము రామార్పణమని మిన్నకున్నది.
శ్రీ రామ జయము

No comments:

Post a Comment