Shared with Friends
గాలికి రేగిన పూల రేకలు
తూలిన ఊసుల పూత రేకులు
మదీ ఏమైపోతున్నవు జరాభారమా
ఓరవాకిలి తలుపులు వేళ తప్పి
దాగుడుమూతలాడుతున్నాయి
ఎవరో పిలిచినట్లయింది
కళ్ళు నులుపుకు లేచాను
చిరుచీకటిలో పరుచుకున్న నిశ్శబ్దము
మళ్ళీ కళ్ళుమూతలు,నాన్నా,
ఎవరదీ,తత్తరపడుతూ మెలకువ
అమ్మా నిజంగా పిలి చావా,
కలా భ్రమా,ఎంత నిజంలావుందీ
నిశ్శబ్దపు అంచున మళ్ళీ మగత
అడుగుల చప్పుడు లే అనే స్పర్శ
దిగ్గురని మెళకువ గంటలు చిరుమోత
మనసు డస్సిపోతోంది,విమోహమా ఇది
కలవరింతలకవల మెలకువ
మెలకువలో నిలువెత్తిన మనోవీచికా
ఆలాపనమే అయితేనేమీ ఎంత తీపి
మనిషీ నువ్వు జరిగిపోతున్నావు
కరిగిపోయే కాలంలో కలలు కన్నీళ్ళు
ఇవన్నీ కదంబ పరిమళ శోభలే
కానీ,పరమావధీ సమ్యుక్తము కావేమో,
సంతోష భాష్పాలూ వెన్నెల తోరణాలూ
వుత్ప్రేక్షలూ,వుత్సర్గలూ కావు!
ఏడ్పులోనూ ఓదార్పు దాగి వుంటుంది
నీకు నువ్వే కన్నీళ్ళు తుడుచుకోవాలి సుమా
కానైతే కలలూ,మనో చిత్త వైచిత్రగతులూ
తోడూ నీడలు కావలి కాసే జోడెద్దులు
నీ భారమయ జీవనములో
మోసులెత్తే సుగంధపు ఊర్పులు
No comments:
Post a Comment