Shared with Friends
రంగరించిన రంగులన్నీ పులుముకుంటాను
రంగమేక్కి హంగులన్నీ విరజిమ్ముతాను
తుంగ మొక్కా తుమ్మ ముల్లూ నా స్వంత మే
నింగి నుంచి నేల దాకా పరచుకుంటాను
ఎదురు లేకపోతే మంచి ముదురైపోతాను
కుదురూ కుంపటీ ఆషాడభూతికిచ్చాను
నదురూ బెదురూ నచ్చిన వాటికి చూపిన్చను
నేనెవరనుకుంటున్నారు మనసుని సుమా
No comments:
Post a Comment