బాల్యపు లయాన్నీ విలయాన్ని చూస్తూనేవున్నా
నాతోడుగా ఎవరున్నారు నీడల్ని చూసుకునేవారు
అవును చిన్నప్పుడు మా తమ్ముడికి నీడంటే భయం
నాకోఅన్నవున్నాడు ఎప్పుడూ హీరోనే,అందంలో,చందంలో
ఆయనా నేనూ పేరులో మారిపోయినా ఆయన ఆయనే
అందానికి అరవిందమూ అల్లరికి గోవిందమూ
తిరువూర నేచూసిన పెద్దమ్మ గారి బంగారం
కొల్లగొట్టి పంచదార తిని తినిపించిన ఆయన
నాకు హీరోనే మళ్ళీ ఎప్పుడో నూజివీడులో దగ్గరైనాడు
అబ్బో అప్పుడు ఫోర్తుఫారమోఫిఫ్థ్ ఫారమో పెద్దచదువే
నాప్రాణానికి కానీ మైమరపించే వెన్నెల స్నేహం
ఆయన స్నేహితులూ అంతే
వుంగరాలతజుట్టు వాడు దర్జీగారబ్బాయి
బుట్టబొమ్మల పండగా,ఆగిరిపల్లి తిరనాళ
అబ్బో ప్రతి శలవల పండగా బొంగరాల సుడే
పిల్లవాండ్ర వడి,దబ్బులైతేకనిపించేవికావు
దెబ్బలూ అంతే పెద్దగా అడిగేవాళ్ళెవరూ,
బడి గిడి అంతా ఇష్టమే,కానీ,భంపూరావుగారు
బెత్తంతోకొట్టేవారప్పుడప్పుడు,
మూణ్ణాళ్ళముచ్చటైందిఆబాల్యం
ఆబాలగోపాల ఆనంద బాల్య స్పృహ
మడుగుమునిగిన ముని
నారద మాయ మ్రింగింది!
రంగన్నగూడెం శలవుబడీ
బడే లేనిశాంతాశ్రమ ఆశ్రయం
చల్లమ్మని గొల్ల పల్లె రాజుపేట
అయిన లేని బంధుసంధోహ పురం
తుని తునికాకు జీడికాయలు
బెల్లంవీధి దివాణం వార పలకలనుయ్యీ
బాదంచెట్టురాళ్ళబండివాళ్ళిల్లూ
ఫైరింజన్ గారికిటికీ యిల్లూ
శకుంతలమ్మగారిల్లూ దేవానందం గారు
అవసరాల వాడూ ఆనక గుల్లిపాడు గుప్తా
సత్యాలుగారిగో(పా)లాచారీ
పెద్దాపురం చదువూ త్రిమూర్తులూ
అరె ఐపోయింది అప్పుడే నాబాల్యం
No comments:
Post a Comment