Friday, March 13, 2026

 26 December 2016

 
Shared with Friends
పగటి కలలో నిరుటి సంగతులు,
ఎంత పెద్ద ఇల్లు,అమ్మా
పెరటీ లో ఆవూ, హాలులో మీరు
ఇల్లంతా ధూళి ధూసరి భరిత మూ
ముక్కుపై జారీ ఉన్న క ళ్ళ జోడూ
ఏమమ్మా వంటరి గా ఉన్నారు?
ఏదో చదువు తున్నట్టున్నారు
అవును,పరమార్ధము తెలియక
పరి వృత్తములోనే భ్రమించానుగదా
ఒంటరిగానే చదువు కోవాలి,
బతికున్నప్పుడె కళ్ళు దగ్గరవుంటే
కళవళ పడకుండా నిఛెనలెక్కున్డే దాన్ని
కానీ తొడైన వాటిని ఒడిలో దాచానుగా
అదిగో అదే మనసు విప్పి చదవ మరిచా
కానీ ఇప్పుడు తప్పక చదవాలి
పుట్టీ పుట్ట కట్టుకు చచ్చే టప్పుడు
చెద పురుగులు చదవనీవు
చద రంగంలో పద విన్యాసం చేయిస్తాయి
అందుకే,చచ్చీ చెడీ చదివేకేకన్నా
ముక్త పుణ్యగా ఇప్పుడే చదివేస్తున్నా

మనసుకు నెచ్చెలులైవురు సు
మనస్పతి యాత్మ యొక్కటె!
పేరుకు జ్ఞానేంద్రియములయ్యు,
తలపుల తలుపులిప్పెడు, తల
నెలకొన్న తంతువు లయిదు,
జనన జన్యు భ్రమణ కారకములు!
చీకటిచూడగనిచ్చలు పోవును.,
చేతనచే మేలుకొల్పవలె నిసీధిన,
తనుహ్రుద్భాషల 'హరి'యే చేతన.
నెచ్చెలులారా కామితములు 'హరి'
వేకువనే అరిషడ్వర్గుల నొదిలి, 'హృది'
సామజవరగమ రామ పాదపముల నిడరే!
విషమ చక్రముల విరిచిన విరించిని వరింపరే!
మన మనముల చీకటి కారుమెయిళ్ళను,
తన తిరుమేనిన జుట్టుకొన్న విభ జేరగ రారే!
తెలవారిన నలుపును కనలేము వేగ లేవరె.,
నే నైదుగుర, నాయొక్కొక్కరారుగురు,
ఒక్కక్క రాగమున కోటి చైతన్యపు టూహలు,
అన్నీయు ప్రాణ ధారకములే,కనుగొంటే
నాయందు సకలములకు యాత్మయొక్కటె!
నెచ్చె లులారా నన్ను నేనుగాక వెన్నుని తెలియ,
వేగమె మేనిని గంగను ముంచి వెన్నను గొని,
తడియారని వడిన కోర్కెల మూట గట్టి,
విడియములి చ్చిమాధవు సేవింపగ రారే!!

No comments:

Post a Comment