Friday, March 13, 2026

 20 October 2017

 
Shared with Friends
చిరు గంటల గుండెల చప్పుడు నాపకు
మ్రోగనీ ఆరవళికి మళ్ళీ ప్రాణంపోసుకోవచ్చు
ఎన్నో జీవులు బధిరమై విలవిలలాడుతున్నాయి'
నీ గుండెల్లోగూడుకట్టుకున్నవీ గుడి గంటలే
వాటి తాళాన్నీ నీగళపుపాటతోకలుపు
నీ అరచేతులతోనేమిచ్చానని ఎంచకు
హృదయంతెరచి ఆర్తిని ప్రజ్వలనముచెయ్యి
ఆత్మార్పణకన్నా ఎక్కువలేదు గొప్పకిపోకు సుమా
సుమదళ స్వేదనములు గుండెపగుళ్ళకు స్వాంతననిస్తాయి
శాంతముగా విప్పార్చిన కళ్ళతోచూడు
అదిగో గుడిలోదీపం అఖండజ్ఞానాన్ని ప్రసరిస్తోంది
mythili abbaraaju gaari aangla kavitaa prEraNatO

No comments:

Post a Comment