·
Shared with Friends
హితముతో జీవితము స్నేహితము
సంగతి నుండి స్తితి లేక గతి
రాగద్వేష రణము నిత్య మరణము
ఇష్టమూ,కష్టమూ తోబుట్టువులు,
మనసు ఎంచుకునేవేఅయినా
మంచి చెడూ విడదీసేవవి
సంచితముగా వచ్చీ సంగతమయ్యేవి
నీడైనానిలిచేదే కానీతోడయ్యేవి
మరణానంతర మిత్రత్వము
పోగైన పుణ్యంతోనో పాపముతోనో
చేసుకున్నవారికిచేసుకున్నంత
అయితే పునర్జన్మ,పుణ్య భావనా
పురాణకాలమునుండీ నమ్ముతున్నదే
బుద్ధి కుదురు జిహ్వ అదుపూ
బ్రుహత్ప్రయత్నఫలాలే,బహుశ:
:
No comments:
Post a Comment