ఇదీ భూతలమే పాతాళమందామా అంటే
పది తలల రావణబ్రహ్మ పరిపాలించినట్లగపడదు
కానీ తలల కొలతలూ,తలకట్లూ వికృతము
మనము వారి రూపాంతరాలమో
పరిక్రియలోమనమేవారిముందు దశో !,
నాతి చరామీ,నిశాచరామీ చరాచర
చరామీ ఈధరాతలంలోలయమైపోయాయి.
విలయవేళ కడలి పొంగిన వేళ వివర్ణాలన్నీ
కలసి వారుణిలో జీర్ణమైనవేళ
ప్రాణముంటే బ్రహ్మ రహశ్యమవగతమౌను
ఏడు పెంకులు పేర్చిన తోడు దొరుకు
పాడు మనస వేడుకున్న కోరికలడగు
నీడ మరుగున తోడుకాని నిజము నెరుగ
వాడి చెడుగగు పాడు మనసునెంచక
కూడివచ్ద్డు జ్ఞాన మరయ వేడుకొమ్ము
ఏడుకొండల వాడు తోడగు ఎడములేక
కాలములారగించెడు కాలుడు
వేళలెరుగు ఓవిష్ణువ నీలీలన
పుడమినబుట్టిన కడు జీవులు
నడయాడెదరు మత్సరముల
త్రుళ్ళుచు,తలువరె తలపున
వనమో కవనమో మనమును
చేకొన్న సుషుమ్నము ఘనమే.
ఎరగని మానవ తీరములను
గమించును, నవమే అనుభవము,
భవ సంచితమో తమోగుణ బద్దమో
జీవనము అననుగుణము ఒకపరి
రణము వరణము దాటిన మరణమే
,కాని,చెదిరిన స్వప్నమే. స్వేదము
స్వప్నాంచితమే,మెలకువ మోదమే
మరల స్వప్నము, మరల విభ్రమము,
తొలగిన సంశయము జీవనమను పగటి
సత్యము,కలయను పరకాయప్రవేశం నిక్కము
తిరిగి తిరిగి చేదు నిజము,నీడకన్న పొడవు.
No comments:
Post a Comment