Friday, March 13, 2026

 Satyanarayana Charyulu Maringanti

23 June 2018 
Shared with Friends
సీతమ్మ మీయమ్మ మాయమ్మ కూడ
తోడవ్వనిదెవ్వరికా తల్లి అమ్మగ
అన్నప్రాణమూర్ధనముగావించి
మనోమయకోశమున రామునినిల్పి
ఆర్తులయాకలిబాపి శాంతినిచ్చిన
యామె కాదె ఆకొన్నవారికెల్లయమ్మ
అన్నమోరామచంద్రయనెడిజనులు
కాదయ్య అన్నమో సీతమ్మా నినుకన్న
అన్నపూర్ణమ్మ కాసినిబాసి వ్యాసుని చేర
కడుగడుప్రయాసలకోర్చి గోదావరీ మాత
కొంగున నీముంగిటసేదదీరికొలువాయనొకో
ఎల్లరకునమ్మె మాయమ్మ సీతమ్మ
నీయది దయ నభూతోనభవిష్యతి
అమ్మా అరుంధతీ మాతకు సరినీవు
కాదు మాతల్లి నక్షత్రములవెల్గు
కడుస్వల్పము నీకీర్తి ఎల్లరమదినవెల్గు
దివారాత్రసంధ్యాది ఎల్లకాలముల

No comments:

Post a Comment