Friday, March 13, 2026

 atyanarayana Charyulu Maringanti is  feeling crazy.

15 November 2018 
Shared with Friends
తలఫుల మలుపుల్లో మనసు సంశ్లేషమైనది
సమమో విషమమో లోతుకీ ఎత్తుకీ చెందని ఆలోచనలన్నీ
నవకుండ హోమంలో దగ్దమౌతున్నాయి
మనసు వలయమే
ఈక్షణమే తనపరివర్తనతలము
భూమిగుండ్రమే
అదుపూ మరపూ మనసుకుండవు
అదునూ పదునూ భూతలానికెక్కడ
ప్రసవవేదనా మరణ యాతనా
క్షణక్షణ కణవిఛ్ఛేద విస్పోటకమె
మనసులోతుల్లో పాదుకున్న
గతం విఘటిత పాప పుణ్య సమ్మేళనమ్
చాప చుట్టుకున్నట్టూ కుబుసమూడినట్టూ
కనబడితే శ్వాస తప్పినట్టే
కాలము తీరకమున్నె
మనసులోతుల్లో మడతపడిన
తప్పొప్పుల అప్పగింతలు ముగించు.
లోగిలి దాటేక తిర్యగ్జడాలన్నీ ఆవాసాలే, అవునా అందుకే
మంచో చెడో ముందే యెంచుకో

No comments:

Post a Comment