..ఆకారమై త్రిగుణ సాకారమై కన, ని
రాకారమై నిలిచి శ్రీకారమై వినని
హుంకారమై కడలి భాంకారమై వెలయ
టంకారమై వెడలి ఢంకారమై తెలియ
హంకారమై కలభ ఘీంకారమై యళుల
ఝంకారమై కేకి క్రీంకారమై సిరుల
ప్రాకారమై కలికి హ్రీకారమై చెలగు
ణాకారమై లలిత క్లీకారమై వెలుగు
అంకారమై రసాలంకారమై పలికి
శంకారమై నిత్యమోంకారమై కులికి
ఆడెనమ్మా! కృష్ణుడు
పాడెనమ్మా! విష్ణువు
(శ్రీకృష్ణతాండవము - గోపికాలాస్యము.
No comments:
Post a Comment