Shared with Friends
వాల ఖిల్యులు వేళ తప్పి
వెతకవచ్చిరో రోచిస్సులకోరి
గుంపులవె గబ్బిలములు
బిల ఖిలములు వదలి
వర్తులావృతములై
తమసాపాశమువిడచి
తర్పణములకు పారణములకు
వెతలతీర్పుకై వెదుకుచుండిరో
హేయమె కోర్కెల తీర్పులు
బంధములు విచలితమైన
గేయము వికృత రాగమౌ
తుది పలుకుకు వేళలేక
బొందిన రూపొందిన తమి
యాత్మలనంటిన సంగతి
తలక్రిందుగ తాపసమైన తరి
గిరి గిరి తిరిగెడు కోర్కెలు
గురి తప్పిన గబ్బిల గుంపులె
కనును బిడ్డల కోరి స్ధ్యనమిచ్చు
అచ్చము మానవ మనమె
నగమున ఖగములౌ
అఘమొ అనఘమొ
రెక్కల నెక్కుడు గూడు
మిక్కిలి చిక్కన పాడు
సాలె పురుగల్లిన చీర
జిగట చారల వెగటు
గబ్బిలమా ఎంత చేటు
నర నారముల మురికి
తీరని గిరి గిరి పోటు
వాటారని వ్యధాచిత్రము
చిత్రము మనఃస్ఫుట ప్రకటన
ప్రాకారము దాటనేరదు
ఏవురు ద్వారములు యెదుట
గిరి గిరి తిరిగి గడవనేర్వదు
అంధ ప్రయాణము గడచిన
మరి జన్మమేదొ దారి
పారణ ప్రసాదమట మరి
తలతుమా గబ్బిలమును
తమ తరముల నెరిగి
వాల ఖిల్య వుషః ప్రచోదనమెంచి
No comments:
Post a Comment