Satyanarayana Charyulu Maringanti
అపర కాసార యోగులు,శ్రీ వైష్ణవ స్వాములు
సాక్షాత్ పుంభావ సరస్వతీ మూర్తులు
తెలికిచెర్ల కందాళ వేంకట అయ్యంగారు
ఎందరి ప్రజ్ఞ వారి బోథలో రూపు దిద్దుకుందో
వారి సంచిత పుణ్య మో తల్లుల తపః ఫలమో
పరమ భాగవత ధురీణులు,విద్యారణ్యులు
గరిమన ఓరుగల్లు పురమున సాంకేత సాగరిన
పరిమళ పరిశోధక గురుతర శాఖకు గురువులగుట
నా జన్మ సుకృతంబు వారలి స్నేహము ప్రపన్న మగుట
కాని,ఎంతటి దౌర్భాము,సేవింప నైతిని,వారి చరణములు
విదిశా,వింటివా,మన అయ్యవారు,జ్ఞానానంద పూర్ణులు
ఇలనియ్యకొనక విరజానదీ విభవ మన్నారుల కడకేగిరట
ఘనులగు వారి పరమ బంధు ప్రియ దార సుతాదులకు
శిష్య,ప్రశిష్యులకు,అగణిత యశోగామిని,బోథాయన
బ్రహ్మ గుప్త,రామానుజ,ప్రాచ్య,యవన,మ్లేఛ్ఛదేశాది
పూజిత గణిశాస్త్ర అధి దేవతకు సంతాపము తెల్పుదము
తల వంచి యోగివాహకులకు మ్రొక్కులిడుదుము.
No comments:
Post a Comment