Friday, March 13, 2026

 30 January 2018

 
Shared with Friends
మనసా అదివొ హరి తిరుమాళిఘ
విప్పారగదె నిగమాంత ధురీణుగాంచ
దాసవైఅణువణువుతన్మయతనొందగదె
చరాచరజగతికవలకైవల్యమునెంచగదె
మదినెంచి హారిని నియమించెదవు మరి
మరు దారుకుడు మరివివరములెంచు
వివరములన్ని హరికీర్తిన వెలుగౌను
వెలుగైన తరి హరివాసము నిక్కము
నిక్కము మనమున చెలెగెడు వికృతులు
కృతిచేయక మనమును కట్టడి కూడదు
కూడని రంధ్రముల జేరి ఒర్వనేల
నేలవిడచి మనస మనకు హరి తలచు
తలచిన అజామీళుని ఆకటి చీకటి విచ్చె
విచ్చిన కన్నుల ప్రహ్లాదుడు చీరె జీమూతముల
జీమూత పెంజీకటుల కవ్వల వెలుగె యాత్మయౌ
ఆత్మదీపమున నారసిమ్హదేవర పల్లాండుజేసె
జేసెడి తప్పులు మనమున నెలకొను
నెలకొని ములుకులౌ గమనము నిర్గమమౌ
నిర్గమ గర్భావాస నరకము మరినవమాసములు
నవమె దేహము పునర్నవమె మోక్షమరయ మనస

No comments:

Post a Comment