Friday, March 13, 2026

 atyanarayana Charyulu Maringanti

20 December 2015 
Shared with Friends
నా మెలకువలో నే నేర్చిన మెలకువలే గమనిస్తా
నా భాషా భావము పెనవేసుకు వ్యక్తమౌతా
కానీ అప్పుడప్పుడు కళ్ళూ నోసలూ మాట్లాదేస్త్తూ వుంటాయి
''భావాలు దాచుకోవోయ్ భాషతో మనసుకు బట్ట కట్టవోయ్''
అని అంతరాత్మ ఘోషిల్లుతూనే వుంటుంది మనసు మూల్గినప్పుదల్లా
నాకు భాష రానప్పుడూ నే మాట్లాడుతూనే వున్నానని నాకు గుర్తు
అప్పుడు నిద్దురలో నాకు గంధర్వ గమన ముండేది
పరిమళ శిరీష వనవిహారాలలో సమయమే తెలిసేదికాదు
నాకు పళ్ళొస్తు స్తున్నప్పుడ నుకుంటాను వళ్ళు తెలిసింది
భాషా భయమూ చోటుచేసుకోవడంతో నా అమృతముద్ర చెదిరింది
నవ్వుతూ నవ్వూతో ఎడ్వడము నేర్చాను
కాళ్ళొచ్చిన తరవాత కలలు కరిగి పోయాయి
మొన్నెప్పుడో చిన్నప్పటి కలొచ్చింది
మళ్ళీ అమృతనగరీ హంసగమనమూ అనుభ వమయ్యాయి
నేమళ్ళీ శైశవ దశలోకి జారుకుంటున్నానేమో


--------------5 February 2017
 
Shared with Friends
తిరిగే కార్లతొ ఎగిరే విమనాలతొ
పలచని జనాలతొ చిక్కటి చలితో
కాలమూ,యోగమూ ఘనీభవించాయేమో
మనసేమో మంచు ముద్దైపోయింది
కాళ్ళీడ్చుకుంటూ గడప దాటినా
ప్రాణం ఇంట్లోకి పరిగెడుతుంది
వూపిరి చిత్రంగా ఆవిరైపోతొంది
అరిషడ్వర్గాలు నివురుగప్పిన నెరవులే
ఈ శిశిరము నేసిలీంధ్రాన్నైపోయా
అమెరికా అంతరాళంలో అనుకోకుండా
పచ్చి వెలక్కాయలతో ప్రవేసించా
ఒక బుర్రకి పది జడల వాళ్ళూ
ఏరుపోర్ట్లోకనబడ్డప్పుడు
ఒర్నాయనోయని పైకే ఆచర్యపడ్డా
ఆనక,బజార్లో,చిక్కుడుకాయలొద్దండీ
రధసప్తమి దాటాముగా,అంటే
యవూరయ్యా నీది,అంటూ,
సత్యవేడుతమ్ముడు పలకరించినప్పుడు
భలే తెలుగు పరిమళమే అని మురిసాను
ఆగి ముందుకు పోతాయి సుమండీ
ఇక్కడి కార్లు, కొత్తైనా పాతైనా
చిరునవ్వుల పలకరింపులూ,మర్యాదా
మరి అమైరికా అంటే నిజంగా విశ్వనగరమే సండీ
హయిదరాబాదులో అయినవాళ్ళూ,
కానివాళ్ళూ,కస్టమే కనుక్కోడము
ఇక్క డవీళ్ళైతే తొలగి దారిచ్చేవాళ్ళు
యక్షులూ,కింపురుషులూ అనుకుంటా
ఎందుకైనా మంచిది,
మనహద్దులోమనం వుండాలనుకుంటా,
అయితే బస్సులూ కార్లూ,విమానాలూ మోతే సుమండీ
కానైతే కరివేపాకు కట్ట యాభై
సొరకాయ,రెండొందలయాభై
ఒర్నాయనో,అల్లుడుగారూ
బలుసాకు,పులుసు కూరా డాలర్లే
మన వూళ్ళో కేటుగాళ్ళున్నా
మనసుకు పొట్టకీ.శ్రీరామరక్షే సుమండీ
అందుకే మావూరే మంచి అమెరికా గడమం-------------------------------------------------

No comments:

Post a Comment