Shared with Friends
ప్రతిరాత్రి రహస్యపు తెలివిడే
ప్రతివుదయం మరపుల వలయె
రాత్రి పవలూ మధ్య దివాంతఃకరణ
కారణమెరుగని జీవన సంధ్య
వంధ్య మనో ప్రచోదనంతో చెలరేగే అహం
అహరహం అనుభవంలో తనుభావం
చెలరేగే మృత కణాలు తుడుపు క్షణాలు
బధిరమదిరాపీనరాగద్వేషమాలికాధరి శరీరి
సగంచచ్చి సగం బతికే మరపుతెరపులు
కుళ్ళి సమాజానికి మచ్చైనా అహమే ఇహం
ఇదే ధోరణీ సాధు హంత మ్లేఛ్ఛమనోమేధ!
ఏదీ భక్తి సాగరము ఎందు మునకలేయవలె
అవిగో తరుణహరిణెల సముదాయము
భవబంధవిమోచక వినమ్ర సందోహము
గోవింద మనఃకామనా అరవింద కెందామరలు!
No comments:
Post a Comment