Friday, March 13, 2026

 30 June 2022

 
Shared with Friends
తనువూ మనసూ తడిసి వెరసి అనుభవం
ఐతే ఐతిహ్యమూ కలా కలగలుపులు
వూసు పోసుకున్న వూహలవుషస్సులు!
తలపులతావితో అంటుకట్టబడి
వలపులోవెలుపలిఅంచున పారాడే
గడియవూడిన గుండె చప్పుడులో
అవి సతత హరితారణ్యాలై
మొగలిసంపెంగల పరిమళాలౌతాయి!

No comments:

Post a Comment