Friday, March 13, 2026

 30 June 2020

 
Shared with Friends
తెల్లారభయం మొదలు వ్యసనాల వల
బచ్చాలూ గొళీలతోమొదలై వెచ్చాలూ
తప్పొప్పుల సవరణలూఉపక్రమణికలూ
గతజలసేతుగురించి సంధ్యా వంధ్యాలాపం
సగటు తెలుగు బాపడా వెర్రెన్ని విధాలు ?
ఆగూ అప్పుడే సన్నాయి నొక్కులా అనపర్తి
లో రైలాగిపోయిందేం! గోదావరికి ఘోరాక్సిడెన్ట్
శంకర్ కేఫ్కీ మార్కండేయవిలాస్ కీ సంబంధమేన్టి
సత్యమంటే సమ సంబంధ విషయాలుండవ్
చిరిగిన కాయితాల్లో అక్షరాలు పోగేస్కున్నసరుకు
రాసినవాడి యోగం బూతోరాతో
చదివినవాడి రోగం ఏతా వాతా
సరే కలోగంజో రాజమండ్రీ
రామశేషగిరి ఆచంట చేరాడా?
అయ్యో తియ్యనిస్నేహమండీ
రాధాకృష్ణకీ అనపర్తికీ తెలుసు
ముత్యాలమ్మ గుడి వీధి
సావిత్రీవాళ్ళింటి ఎదురు
శనివారం ధవిళేశ్వరం
నశ్వరచరిత్రలో చిరిగిన
ధవళగిరి సంబంధపు కల
కోరిక వూపిరి వారిజ తామర
గౌతమి తమి తీరని
ఆర్ట్స్ కాలేజీ కధ
ఏంవాయ్ మోడ్రన్ బియ్యే
కొండూరివారి సందు
ఆరెమ్మెస్ అన్నగారు
ఆయనే అచ్చమ్మాళ్
గారి స్వామి పలకరింపు
ఆమెకి తెలియందేముంది
ధవళగిరి దేవతగదా
తుఫానులో డొక్కాసీతమ్మ
చక్కెరపాకం నొక్కుల నగవు
చారెడునెయ్యీ పప్పూ
అన్నం తిన్నానక
అపురూప మాతృబోధ
చదువుతెమలక
రైలెక్కేసిన రోజొక మలుపు
మొద్దుమనసుకు
ఒంటబట్టని మేలుకొలుపు
మరొక మజిలీ
పాపిలాన్ నవలకి
నాందీ ప్రస్తావనే
తలదించని బిరుసు
చిరిగిన పేజీలో కధ
తెగినయాభైయేళ్ళకి
కల్లో మళ్ళీ కాలేజీకోచ్చా!

No comments:

Post a Comment