క్షణికం క్షణాల ప్రోది లో తృణం
కాలాన్ని త్రావి తనువయ్యే ఘనం
కలల అల నిదుర, అలజడి మెలకువ
రోజుకు రోజుకు దహింజేది ఆకలి
దహన దగ్దితము గతము
గురుతుకు గరిమ గలిగినది విద్య
పెరగకపెరిగి తరగక తరిగి
చీకటి పులుముకుంది వయసు
గురుతులేమరి జరిగేది గతము
మరలి వెనుకకు తలరి ముందుకు
తూగు టూయల తనువు అల్లిక
జిగి ప్రిదిలి దిగజారేది ఆయువు
అంతర్బహిర్వ్యాపిత అనఘ
అనంత చరిత మొలక తను తన్వి
No comments:
Post a Comment