Thursday, March 12, 2026

 లలు కరిగిపోతాయా కాదేమో

పగలేగా కను మరుగయ్యేది
చెట్టూచేమా రాత్రే చిగురించేటప్పుడు
తీవా చేవా రాత్రేగా అల్లుకుపోయేది
నీడ పుట్టి పెరిగి మట్టిలో కలిసేది
కళ్ళు వళ్ళు తెలీకుండా పరిగెట్టేదీ
పగలే,నిద్రకి రెప్పలైతే వుంటాయి
కలలు జీవిం చేది కలత లేని కళ్ళల్లో
కలత పగలు మనసుకు పట్టిన నలత
ఏలతా వసి వాడాలనీ నస పెట్టదు
మనోలత మాత్రం భ్రమర కీటకమే
అల్లుకు పోతోనే వుం టుం ది కళ్ళబడితే
కామ్యాలన్నిటికీ పగలేగా వునికి
నిదురలో తప్పులకి నిప్పులు తొక్కమూ
అప్పుడు చెప్పుడు మాటల చెవులూ
చూపుల కత్తుల కళ్ళూ సుప్త చేతనలే
మనసే మం దిరమౌ తుం ది సుం దర
సత్యము ద్యోతకమయ్యే సమయం
జగదానం ద నిద్రా ముద్రితమేగా

No comments:

Post a Comment