Thursday, March 12, 2026

 జగతికి జాతి కూర్చిన కలకూజితము భాష

హృదయఘోష భావము భవబంధ వివరము
హ్రీంకార ఓంకార హుంకారము'లక్షయములు
అనంతకాలపు శుక పిక శారికాలపములవ్యయములు
ప్రసరించే ప్రకృతి కణకిరణపు స్వరజితులు
నిషాదము విషాదమే కాని కాలపురుషుడు కనిపించడు
కనిపెంచిన బంధములు కమనీయకావ్య విషేషాలే
కాని కనికరమెక్కడ కాలుని కరవిన్యాసాలకు!
రోదనము సాధనమేకాదని,తీతువు
హేతువులేకుండాకూయదనీ,తెలియనేర్చిన
మనిషీ అక్షయ పక్షి జాతులూ,జంతుజాలాలూ
జడ ధ్రుడ ఘంభీర సముద్రఘోషలూ అంతమయ్యేవే
దీనమో వినయమో వివేకమో, విషాదమే మరణము!!.
మనీషీ,ఘనుడవే,మరణిస్తూ,అమరమౌతూనేవున్న్నవు
అవును నీ భాష
సకలప్రకృతిమూలకాల కలభూషణముకదూ
అందుకే, మాతృక సజీవ గోచరమౌతోంది,
క్షర క్షార రహిత అక్షరనిక్షిప్తమైపోయింది
ధరణి చరణ ధూళిలో నీపాదముద్రలు సజీవాలు,
నీ గళ గమన నేత్ర వీక్షణాలు,
మనోభి సృజిత మనోగ్జ దీపాలే
అవి తర తరాలకూ,
ప్రసన్నా ద్రుక్కులు ప్రసరిస్తూనే వుంటాయి
మరి భావాలని మలినము చేయకు,మనుగడ స్తిరమా?
మన బతుకు తినబడేవరకే' తినిజీవించే మనసును చంపకు!
యోచించు,ప్రకృతీ పురుషుడూ వేరు,కాలుడే అతడు సుమా.,
కారణమింకా తెలీదు కాని ఆన్వేషణనాపకు!
చనిపోయేలోగా మేధస్సు తిన్నది,
తిత్తిరీయోపనిషత్తే,అది నీది కాదు,నలుగురిదీ,
ఔనూ కూడబెట్టిన జాడల తోడు ఆడబిడ్డ లకియ్యి
కొడుకులు కూడదీసుకు భువన విజయం చెయ్యాలిగా!
భాషా భావోన్మీలనంలో ఆదిశంకరుల అంశలేగావాళ్ళు!
తెగిన తంతువులు తీసి వీణని సరి చేస్తే
కొత్త స్వరాలూ,సంగతులూ సరస్వతి పలికించదూ,
మేలుకోని హృదయాలు,మట్టిలో కూరుకుపోతాయి
మేలే,తలుచు, మాటలు అక్షరాలే జాగ్రత్త!
ప్రకృతి తడిమి కడిగేలోపు మనసు తడిమి చూసుకో!
తడిపొడీ,బ్రతుకు బుగ్గి బూడిద,తరువు,మాట కల్పతరువు!
జాగ్రత,మళ్ళీ మళ్ళీ ప్రచోదన ముంటుందోలేదో,
మనిషి ఆన్వేషణలో ఇంకా తెలిస్తేనా,!!

No comments:

Post a Comment