రాధ యన అద్వితీయ ఆమె విననేరదు
బాధ యన్న దె రుగదు తన ధ్యానమున
నీడై వెనువెంటజనెడి ఘన విష్ణుక్రాంత
తరువై తీవై పరువముగల శిరీషమై
కృష్ణ గమనముననిర్గమించును
కృష్ణుఁడన మాయ అగమ్యగోచరము
నలుపే కాని వర్ణముల కతీతమతను
వెలుగుకు నీడ నెఱుంగుదుము
నీడకి నీడనుండనోపైన అట్టిది
గోవర్ధగిరిధారి సంవర్ధక భక్తి
అట్టిదాని ప్రాపున ప్రభవించే మాయ
దేవి రాధ మాయామయి అపర్ణ కాళీ
ఉగ్రమున రుధిర వర్ణ మహాకాళి
కంకాళ మాలాధరి రౌద్రి ముక్కంటిని
పద తాడనమున మర్ధించిన పరాశక్తి
శాక్తేయుల నిత్య పూజలందు సత్యమతి
కలికాలమున ప్రతినారీ శక్తిమతి కావాలె
ప్రేమ కామచోదితవ్యామోహముకారాదు
అట్టిది మాయా వినోదమగు ప్రకృతిన
పుట్టినపుటక,స్ఫురణన మన్నింపని
విధమది మన స్మృతిని విభ్రమము
విభ్రమమతి అధమ శ్లేష యగును !
శ్లేష అనుచిత చిత్తమతమగును !
దానికి నివృతి విమల యశో గానమే,
తత్ మాతాపితరుల దయ క్షమా
వారిని స్థిత ధర్మ నియుక్తము చేయును.
పాండురంగని పద భక్తియే భాజనము!
రాధ అమాయక అని కాదు ఆమె,
మౌఖిక లాస్యము వైమనశక్యము!
కృష్ణ పక్ష ప్రేమన పక్షపాతియైనది!
యక్ష గరుడ కిన్నెర కింపురుష
మానవ దానవ పసు పక్ష్యాది
భూచరఖేచరములకు,
తిర్యక్జడములన్నికి కర్త భర్త
యాతడు! అట్టిది రాధా మాధవీయము.
మనకాల రాధలు మౌఖికముగ
మాతృ స్త్య నమును గ్రోలియు ,
గురువుగా అమ్మను నమ్మనివారు.
కమ్మగ కామ్యక వనమున
తిరుగుట జీవన ధన్యత యని,
ఎంచి తెంచి తెగించి,
దాచి ముంచినవారు .
కానీ నంద సోదరి తలి
తండ్రులు దయామయులు !
అమంద ఆనంద కందళిత మనస్కులు !
అదియే సౌజన్యము సౌందర్యము !
ఇంతకు మించి వివరము నే
చెప్పలేనమ్మా చెల్లి చిన్నప్పటి ,
చిన్నతనము చెరగని కుట్టీ.
No comments:
Post a Comment