నలుగురితో నారాయణ'
నలుగురితో నారాయణ'
పదుగురితో పారాయణ
చదువరి నీకే వివరణ
పరిచయమే మీ వితరణ
చదివిన పదముల అర్ధము
పరమార్ధాన్ని సూచిస్తే
నిస్తబ్ధమైపోయావేం
తరుణంలో భాగ్యవిధాతవే
నీవు సైతము శ్రీరామరక్షవే
నీ తర్జనితో ప్రళయాన్నాపగలవు!
పన్నాలతో వేదం సంపూర్ణంకాదు
వేదాంతము మీమాంసా అవసరమే !
సమాజములో క్లైబ్యానికి నీదీ
సమ సంబంధిక చుట్టరికమే !
ఇక నీ ఉత్తరాపధ గమనంలో
తలనే ఎంచక చుట్టూ చూడు
ఎవరైనా కానీ తలదించుకు
గ్రుడ్లనీరు కుక్కుకుంటూంటే
తలఎత్తి ప్రశ్నించి ఆదరించు !
ఆత్మవిశ్వాసాకి ఊపిరి పోయి !
కష్టం వస్తే ఖర్మకాలాలని ఏమీలేదు!
ఇష్టపూర్వకంగా ఆశ రగిలించచ్చు!
మనమొకప్పుడు సంఘ జీవులం!
త్రేతాగ్నులు సంపద సమంచేసేవి !
సరే విషయానికొద్దాము!
విషమపరిస్తుతులలో
నిశ్శబ్దాన్ని వదిలేద్దాం!
అన్నపూర్ణ నారాధిద్దాం!
with due respects to vangipuram vedanta muralee dhar
No comments:
Post a Comment