Shared with Friends
మరో చెదిరిన గురుతు!!
గత జల సేతువు ఙ్ఞాపక నిక్షిప్తము
సంగత విమలము విస్ఫారిత మనో దృశ్యము
సాంద్రమనోహర నీహార హారము
కుపిత విధి విధాన క్షుబితక్రియా పరిఛ్ఛేదము
కాలావృత సతత విభ్రమ పరవలయము
చివరల చిరిగి చెరగి చని కనిపించని వివరము.
ఆహా కాలమా,ఎవరి వశమ వీవు, నివురుల
వుసురుతీయు భూతగ్రహాతీత ప్రేతాత్మవా
కాల నీల కాళ కేళీ ఖేదమోదభంజక మయవా
యమవా సంయమవా ధృమవా విధృమవా
చావు రేవున చీరిన జారిన
ఆత్మావాస చిల్లపెంకులవెంట,
చితికిన ఙ్ఞాపకపు అంచున
నిలచిన కన్నీటి మరకవా?
చెరగవు కరగవు జరిగిన
రోజుల మాటున దాగుడుమూతలు
గురుతులు వెంట పరుగులిడు
వూసుల పిచ్చుక గూళ్ళు!
కాగితం పడవ అకాలమో
సకాలమో చివరి అంచు జరిగి
యెవరి యెవర వివరము
మరపు ముణక వేయు
సత్యహరిశ్చంద్రుని కాలపు
మేఘములె కమ్మి విడివడెడు
ప్రదోషకాల ఖడ్గ ఛాలన వాసివా
తమసోమాజ్యోతిర్గమయ
అసతో సద్గమయ
మృత్యోర్మా అమృతంగమయ'
అవును రాలినవన్నీ నక్షత్రములె
వాటి మినుకు మిణుకులే
మన మనః ప్రచోదయములు!
No comments:
Post a Comment