Thursday, March 12, 2026

 ఏ అయ్య కైన,అమ్మకైన,అనాది నుండి,ఆది అమ్మయె,

ఏ కొమ్మనైన పువ్వునైన కానవచ్చేది అమ్మయె
వెలుగౌక మున్నె,
పొదివి పొత్తిళ్ళనెత్తునది అమ్మకద,
సమయోజనీయ,సమ్యుక్త,సౌందర్య,ఆహార్య అమ్మకాక వేరెవరు?
ఏ అయ్య కైన,అమ్మకైన,అనాది నుండి,ఆది అమ్మయె, ఏ కొమ్మనైన పువ్వునైన కానవచ్చేది అమ్మయె వెలుగౌక మున్నె, పొదివి పొత్తిళ్ళనెత్తునది అమ్మకద, సమయోజనీయ,సమ్యుక్త,సౌందర్య,ఆహార్య అమ్మకాక వేరెవరు?? మాయ కడుపున నేనెవ్వరొ నాకేమి ఎరుక స్వామీ దయాంచిత కృపాసాగర వరద కృష్ణ నన్నమ్మప్రాపున బుద్ధి జీవుని జేసితివి నిన్నెన్నిన నెన్నకున్న అమ్మ వెన్నెల చల్లనననే బుద్ధి బద్ధుడనయితి అమ్మలేని తరిన తల్లివి తండ్రివి మరి అమ్మ వల్లెవేయించిన స్పృహన సఖుడవు నిజముగ క్రిష్ణా పెను చీకటిమాయ పొతన్న చెప్పె అగునొ కాదొ మాయ మరపున నాకేమి ఎరుక ఎల్ల లోకముల మెలగు జేజ తన కాలజిహ్వను తెరచివెలుగుల మ్రింగి చీకటులనుమియునట నటవర కృష్ణ గళమొ బిలమొ కాలమొ మేలమొ నేనెరుఫ అమ్మను చీకటుల జేరి వెలుగున వెలయించగదె

No comments:

Post a Comment