Thursday, March 12, 2026

 "పింఛము లేదు కాని వాడు మంజుల పద పల్లవ కోమలవేష ధారియె

నల్లనివాడు కాదు కాని నెన్నుదురున అలకలల్ల లాడగ బుగ్గలుపూరించి పిల్లన గ్రోవూదువాడె
గోప వధూటిని కానము కాని దీప ధూప యుత నానావిధనైవేద్య యుక్త కప్పుర పరిమళ దేవళ యంతరాలయమది!అచట ముచ్చటలాడితి
ముగ్ధయశో శైశవ మూర్తితోడ!
యంచగనైతి యతడు వెన్నుడని, తిరువేంగడ నాధ
లీలాభాష వేషకుడని!
తినవేట్టును నాకు, తను తినుచు,క్షీరామృత నైవేద్యభక్ష్యములు!
జిలిబిలి పలుకుల,థళుకులాడెడు నగవుల వెన్నెలలను చిన్నజేయు!
తను సొంపగుయామందిరముల దిరుగునట, తిరిగిచూతుము రారమ్మని చేతులదొరకబుచ్చుకు పరువులెత్తు!
గోడలజొనిపిన దేవతామూర్తులు,
విశాల మాళిగలు అందందు పెద్ద వంట కూర్పులు,నల్ల
నిగారింపు మూకుడులు, చెవులుగల పాత్రలు యారగింపు వంటకములవశేషములు మిక్కిలి చక్కనివైయున్నవి!
తిరిగి తిరిగి గిరి బాలుడు అంతరాలయమున దిన్నెపై కాళ్ళనూపుచు వూసులాడె వివరముల! ప్రాసాదములొచ్చె పళ్ళెరముల తెల్లని మీగడతరకల పాయసము, జున్ను, నడుమ నడుమ నానావిధ రుచిరార్ధములు! నాకు వెట్టెనో యేమో నేనును తినుచుంటి! జంటమాటల తేనెల విందున!
ఇకనే నేటికి పోవలే పోదుననుచు లేచును, మరల యాగును,
అట్టితరి
నోటికి చెరగు కట్టుగలనొక తల్లి కనవచ్చె! తినుచు నగుచు సల్లాపముల మునిగిన నే నాయమను జూచి చూపుల తిప్పుతరికి బాలకు డేడి! యుల్లము ఝల్లుమనుగ మాయమాయె! సంభ్రమమున అటునిటు వెదకెడు నన్నుయామె యేమియేమని నిలువరింప,
అడుగొ బాలుడు, ఇవియే మేము తినుచున్న వి అతడు నిలువడె, విడిచి చనినాడె, నా ప్రాణములు వివశమగుచున్నవె తల్లి, వెదుకుమమ్మ యీ మాళిఘల నెందున్న వాడొ!
నివ్వెరన నయ్యువతి" యతడా ? బాలుడా? ఇట్టి వేకువతరి యెవ్వరిక్కడ?నీవెక్కడవాడివి,ఇక్కడ చిక్కువడితివి, కలగంటివేమో, కాని ప్రాసాదమ్ములు నిజమైనవి, గృంకులిడిన సలిలమ్ములీ తీర్థ శేషమ్ములే! ఓహో నీవెంతటి భాగ్యశాలివి, వెన్నుడె నీతోడ నాడిన వాడు ! గొపవధూటిని విడచికార్వేటి నగరిన కొలువైన వాడు! నీ కనుల నిలచి నిను పిలచిన వాడు! అన్నా, యేలీలన నీకీ భాగ్యమబ్బెనో యన్న,
అమ్మా , చంపు రామాయణమును సొంపారగ పారాయణమాచరింపగ మది నెంచినాడ, వెదుకగ వేంకటపతికవి,ఋగ్వేద పాఠి, దీటుగ నిటవెలయెంచెననివింటి! సాయమీయవే,.... యని యలుగెత్తి పలుకుచు
మేల్కొంటిని.....

No comments:

Post a Comment