Friday, March 13, 2026

 నిన్నటికి గతమెంతదూరం

నేడు నిన్నైననీడకితోడౌనుగదా
రేపేమగునో యేయెండననీడగునో!
తోడైననాకు నిన్నటికలదీర్ఘసుందరి.
ఒౌనునేనిద్రన పసికూనను ఎన్నగ,
పన్నగశాయి లాలిపాటనువిందును!
వడివిడచివడివడినడువనెంచినతరి,
నిబిడ గూఢ ప్రాపంచకమైనది మది!
అది యడుగులకొలిచిన నీడయె గతము!
కంటిని మొన్నగు నిన్ననల చిన్నగనేడు!
ఎప్పటిజోల, తీపికలగద, ఊయల పాట!
అమ్మా యని వెక్కి వెక్కి యేడ్చీనయెద,
ఎంతగ సోలి సోక్కినదొ అమ్మ అక్కునజేరి!
భగవంతుడ! యయ్యడల కడలి దాటినే,
చేరగ వచ్చుచుంటి నీకమ్మనికౌగిలిని,కాని
కాలుసేతులనుగ్గడించు గుండెను గూడె
చీరిన బతుకుతీపిన 'సంచిత పాపభీతి'!
విడిచి విడువక తలచి తలువక కని కానక,
అమ్మా యని గీలించునామది 'సంవేది'యై,
వింటిని నీగుండెల పరుండి శ్రేయో ప్రియమున
విడిచి నీనీడని దాటి మెదవుల నీడన వాడితి!
తోడెవరీ చివరి చీకటి నయనమ్ముల కలన 'నీవెగద'!
కంటికి కానని నీడన నిలచి 'ఆకొంటి' నందువు,
పుట్టి విడివడి, నడచి పుడమిన దారులెంచి,
చెట్టువిడచిన పిట్టకైవడి, చిక్కితి పెంజీకటిన!
చేరెదనో నీవడీ, ' నాయన'చిటికెనవేలందించునొ!!!

No comments:

Post a Comment