Shared with Friends
kRshNa leela
వుట్టి కొట్టావా, వెన్న కోసంచిట్టి పిడికిలితో-
చెయ్యినొచ్చేనా!అన్న పిడతా,
కన్న తండ్రి చెయ్యి నొచ్చేనూ!
అమ్మ చూసిందీ, కర్ర తెచ్చిందీ!
ఎట్లే అమ్మ, ఏమందు !
నోటినిండ వెన్న, చేతిలో వెన్న
! నే, కన్నని, వెన్నను తిందును,
ఏమందును ? వారందరు
వెన్న దొంగందురు, వెన్నెల తోడు!
నే నీకన్నను, నే నలుపందురు
, గేలిచేతురు. వెన్న తెలుపు
,పాలు తెలుపు, అన్న తెలుపు,
వ్రేపల్లె వాడన గొల్లలందరు తెలుపు,
నాన్న తెలుపు, అమ్మ! నీవు తెలుపు
, నేనేల నలుపు,? తినిదెను వెన్నల నెల్ల,
త్రావెద క్షీరములు, ఆడెద నీరముల,
జమున నల్లనయ్యె, జలకములాడగ.
తొలగదె నామేని నలుపు?
, అమ్మ, కొట్టకె. నన్ను, వెన్న తింటినని.
కడగవె, నీ చల్లని చేతులా నా మేని మాయతొలగ.
No comments:
Post a Comment