Friday, March 13, 2026

 15 March 2019

 
Shared with Friends
Originol text and context are the sole ((SOUL) property of Sri M S N SESHU.( maringanti seshu)
మనకి అప్పు కవాలిరా"
ముందు ఆ నోట్లో చుట్ట పారేసి రారా"సరేనా !
"మనకి అప్పు కావాలిరా"
"ఎంత కావాలిరా?"
"వంద కావాలిరా"
ఇంకొ మాట చెప్పు"
"వంద రూపాయలు చాలురా"
"అలా వంద అప్పు ఇవ్వకూడదు,పొనీ....
వెయ్యి రూపాయలు ఇస్తాను తీసుకో "------
1979లొ నేను నాగార్జున గ్రామీణ బ్యాంకులో
పని చేసేటప్పుడు నాకు ఓ కోయ వాడికీ
మధ్య జరిగిన సంభాషణ ఇది!
ఆ కోయోడు గోచీ పెట్టుకుని వున్నాడు.
పైన ఓ తుండు ముక్క లాంటిది వుంది.
వాడి దగ్గర కల్లు వాసనొస్థోంది!
వాడి కళ్ళు ఎర్రగా వున్నాయి.
.వాడి చేతుల్లో సిస్తు రసీదులున్నై.
వాడిది 20 కిలోమీటర్ల దూరంలో వున్న
ఓ కోయగూడెము. ఎండాకలం మే నెల!
సూర్యుడు భగ భగ మండుతున్నాడు.
ఉదయం పదింటికే బ్యాంకులో జనం
వున్నారు. నేను వోచర్లు పాస్ చేసి క్యాషియర్ పంపిస్థున్న్నాను కొంచెం
హడవుడి తగ్గాక ఆ కోయోడి కోసం
చూసాను..విచిత్రం వాడులేదు,జంప్ !.
ఆఫీస్ బాయిని, "వాడు బయట వున్నాదేమో
చూడు "...."ఎక్కడా లేడండీ", బాయి దీర్ఘం తీశాడు. ,
'అదేంటి సార్, వాడు మిమ్మల్ని ఏరా గీరా అంటూంటే
వూర్కుంటారు" క్యాషిఎర్ ముఖంచిట్లించాడు.
నేనేం
మాట్లాడలెదు. ఒంటి గంటకల్లా బ్యాంకు
బోసి పొయ్యింది. బాయ్ నిసైకిలు మీద
రెడ్డిగారి హోటల్కి పంపించి మీల్స్
తెప్పించుకు తిన్నాం.రెండున్నర-
కల్లా క్లోస్ చేసి జనరల్ లెడ్జర్ బ్యాలన్సింగ్
చేస్తూ కూర్చున్నాం.సాయంత్రము
నాలుగయ్యింది---అప్పుడొచ్చాడు...
ఒగర్చుకుంటూ ---మన కోయ అప్పుదారు!
"సరేరా....వెయ్యి రుపాయిలివ్వరా,"
"ఇంతసేపు ఎక్కడున్నవురా,"
"ఇంటికి వెళ్ళానురా."
"ఎందుకూ"?,
"వెయ్యి తీసుకోవచో లేదో నా
పెళ్ళన్ని అడగటానికి."
అవాక్కయిపోయాను. కడుపులో దేవినట్టైంది...
..పొద్దున్నె 20 కి.మీ. నడుచు-
కుంటూ వచాడు..మళ్ళీ ఎండలో 20 కి.మీ.
నడుచుకుంటూ వెళ్ళాడు...తిరిగి మండు-
టెండలో నడుచుకుంటూ వచడు. మళ్ళీ
20 కి.మీ. నడకనే వెళ్ళాలీ, మై గాడ్! వెంటనే ఆస్థాన ఫొటో గ్రాఫర్ని
పిలిపించి వీడి చేతుల్లో పలకపెట్టి
అక్షరాభ్యాసం చేయించి ఫోటో
తీయించి....మర్నాటి తారీకు మీద
డాక్యుమెంట్ తయారుచేసి వీడి వేలి
ముధ్రలు వేయించి మళ్ళీ సేఫ్ ఓపెన్
చేయించి వాడి
చేతుల్లో పది వందల
నోట్లు పెట్టాను.
",బిళ్ళలు లెవారా?".. అప్పట్లోట్రైబ్స్ ద్రుష్టిలో
డబ్బంటే కాయిన్సే." పర్వాలేదురా..ఇదికూడా డబ్బే, తీసికెళ్ళి
నీ పెళ్ళానికియ్యి."------వాడెంత వేగంగా వచాడో
అంతేవేగంగా వెళ్ళిపోయాడు.
హ్యాట్స్ ఆఫ్ఫ్!
వాడి కళ్ళలో బలం వుంది!
వాడి కడుపులో కల్లుంది!
వాడి ముందో లక్ష్యం వుంది!
వాడి వెనకోశక్తి వుంది పెళ్ళామ్రూపంలో !!.....
వాడికి కావల్సింధల్లా ఓ
ఆపన్న హస్థం ఓ ఆదుకునే మనిషి.
ఆ రోజువాడికి ఆ మనిషి దొరికేడు
ఈ వెధవ రూపంలో!....(?)
వాడు ఆ అప్పు తిరిగి చెల్లించాడో లెదో
నాకు తెలియదు, అప్పు ఇప్పటిదాకా రీపె చెయ్యకపోయినా కూడా, .......
వింటున్నారా.....................
9000 కోట్ల రూపాయలు మాత్రం కాదు.ఐ బెట్
వాడి చేతుల్లోసిస్తు రసీదులున్నై.
వాడిది 20 కి.మీ. దూరంలో వున్న ఓ కోయగూడెం.
ఈ వచన ప్రచోదనము మా పెద నాయన గారి మూడవ పుత్రుడు శ్రీ సత్యం శేషు గారి సుదీర్ఘ నిత్యానుభవ సేవా పరంపరలో ఒక చిన్న ఘటన సుమండీ. ఆనందించండి చదువుకొని........
హృధ్బాషా హృధ్ఘోషా సుహృదయతా కలబోసిన ఓ అలసిన నేస్తం, నీ అనుభవాలసారం క్షమాశీలి కారుణ్యకృపా యశస్వి భారతి హృదయ స్పందన!
" ఒక్కడు ఒక్కడు ఇంత వినమ్ర వివేక శీలి చాలు నావునికి నాపెరు నాకీర్తి నిలప యని ఇద్దరణి మది పులకితగాదె!"
మరుగునడాగిన యీ అమృత చరిత విని సాక్షాత్ ధర్మదేవత దర్శనయనుభూతి చెందనివాడు పాషండుడు, క్రోధి, దేశ ధర్మ ద్రోహి!! ఇట్టి వందనీయ కర్మచారీ అధికారుల ఖేదకారకులకు పుట్టగతులుండవు! అధికారులార రాజకీయ రాజ్య భోజ్య పూజ్యులార కళ్ళు తెరవండి. శేవ విశిష్ట విశ్వ రూపాన్ని వీక్షించండి!!!!!

No comments:

Post a Comment