Friday, March 13, 2026

 6 April 2017

 
Shared with Friends
ఎవరెవరి తనయులో వివరమరయ విశేషమె
కాని మనకెల్ల తండ్రి మన తండ్రులకు తండ్రి
నిక్కము రామయ్య దిక్కు ధర్మము రామయ్య
ఆకలికి అన్నమోరామచంద్ర వేదనకు రామరామ
శ్రవణ దృశీస్పర్శాదిపాప శమనమునకు రామరామ
జోలలు లాలిపాటలు బాల రాముని వశములె
కోటి వీణల రాణి పాటలన్నియు రామ కృతులె
ఎల్లలెరుగని రామ భక్తిన హనుమ రామునిమించె
భ్రాతృభక్తిన రామ పాదుక దర్మమై శిరోధార్యమయ్యె
వెరసి రామ నామము మూల మంత్రమయ్యె
ఎవని వంశమో ఎవనిఅంశయొ నెరుగ నే
నేరుతు రామభజన భధ్రుని సాక్షిగ
రామ శ్రీరామ రఘురామ భద్రాద్రిరామ !!

No comments:

Post a Comment