Shared with Friends
కళ్ళుమూతల వెనకాల కలలో
కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నా
క్షణకణాల తోరణంపైఙ్ఞాపకాలు
అల్లుకున్నముళ్ళ తీవలు,
తాటితోపులక్రీనీడల్లో మొగలిపొదలు!
వంటరిఎడారుల్లో ఎన్నెన్నో దారులు
బతుకుదారికీ రహస్యపువంతనెలు
అవును మేమెరగని ఋతువులు
పరిసరాల అడవుల్లో గుబాళింపులు
ఇల్లుదాటి నిచ్చెనలేసుకున్న పల్లవింపులు
వసంతం కోసం మనసు తోటలో విత్తులు
పూచి గుబాళించి విరజిమ్మే వసంతాలు
.ఇల్లు విడిచి గూడుకట్టుకున్న పక్షులు
కొత్తచుట్టాలు చక్కదిద్దుకున్న కొత్తపాటలు
నాతరం అల విరిగింది కలా చెదిరింది
పెంకుటిల్లువిప్పుకుంటూ సిగ్గుదాచుకున్నాం
పదిమందిమి రెండు దారుల్లో' మాముందుతరం
రెండుకెరటాల మధ్యస్ధంగాకొట్టుకొచ్చాము
రేవడి ఒడిలో కాలంచేసిన వారు
ప్రాణంతోడుకునే ఙ్ఞాపకాల శిక్ష
ప్రేమ రాహిత్యపు వసంతంలో
మంత్ర రహిత యఞ్ఞంలో
సమిధలు సంహితాలు
ఒకచెల్లి ఒక తమ్ముడు
రెండు కదంబ వృక్షాలు
ఒ'క సౌగంధిక కమలం
రెండుబొమ్మల రూపాయి
పాపాయిల వూయల
పల్లకీ బోయిలు
చుట్టాలౌతారా?
తల్లి తండ్రి పేరుపేరుకీ
వేరువేరని వారు చెప్పారు!
అవును ఋణానుబంధ రూపేణ
పశుపత్నీ సుతాలయా: !
ఋణక్షయే క్షయంయాంతి
అబ్బే ఋణం నఋణం అనుభవం
ఆమరణ పర్యంతం ఙ్ఞాపక తోరణం
కలల నిద్ర వూసుల పవలుముద్రా
మస్తిష్కందోబూచులాడే క్రీనీడలనిజాలు!!
No comments:
Post a Comment