Shared with Friends
సీతారామచంద్రస్వామి సోమ సూర్యనేత్రుడు! పరసురామ క్రోధాన్తకుడు. సమస్తమునిగణములచేత పూజించబడ్డవాడు. అహల్యా శాపవిమోచకుడు. మాయా ఛ్ఛేదనకు మాయామృగ కారణంతో అరిషడ్వర్గ హయచోదిత దశదిశావ్యాపిత దశేంద్రియ దశ శిరః విన్యాస అకాల జన్మిత వికార ప్రకోపాన్ని నివారణ చేశాడు!ఒక్కేక్క అడుగుతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అసురశక్తుల ఉన్మత్తతని హరిస్తూ పదునాల్గు సంవత్సరాలలోపృధివ్యాప్త పీడలని తొలగించి చక్రవర్తిగా సమవర్తిత్వంతో పాలించి రాజ్యమంటే రామ రాజ్యమనే భావన శాశ్వతము చేసి అవతారం చాలించాడు! బ్రహ్మచేత అవతార పరిసమాప్తి గుర్తెరిగి జలజాయతనమై నిర్గమించాడు! అగ్ని ష్టోమకారణంగా పుత్రకామేశష్టీ ప్రసాదమై కౌసల్యా పుతృడు దశరధ మనోవల్లభుడూఅయ్యాడు! దేముడి పెళ్ళికి అందరూ పెద్దలె అనే చాటువు రాములోరి పెళ్ళితోనే మొదలైంది! పెళ్ళి పీటలమీద కూర్చున్న పెధ్దలు అమ్మా నాన్నలై వారి వారి గోత్రాల ప్రవర సంకల్పించుకున్నా మెచ్చదగిందె!ఆయన విగ్రహాన్ని పూర్వావతారాలన్నిటి సంయమిగా భావిస్తే రామ నారాయణుడే!! నారాయణుడు కాలాంతకుడు ! రాముడు దశేంద్రియ రధ చోదక సర్వారిష్ట క్రోధాంతకుడు! ఎకమేవా అద్వితీయమ్ రామమ్ శ్రీరామరామమ్ శ్రీమన్నారాయణావతార సుస్పష్ఠ ప్రకటితమ్ త్వం భద్రాద్రి రామమ్ సర్వలోకపూజితమ్ మహామ్యహమ్ !!
No comments:
Post a Comment