Friday, March 13, 2026

 9 April 2019

 
Shared with Friends
నీ పరంపరలో నీవొకతేజానివి
నీజన్మపరంపరలో ఉత్తేజానివి
స్త్రీవో పురుషుడవో పదగామీ
వాసిక్యతా రాసిక్యతా నీలక్ష్య స్థితమే
ఏ పాద రక్షైనా శ్రీరామరక్షే లక్షణ సంసారమైతే
అడుగడుగూ జీవన యాన సంకలనమే
నీచెంగుముడేగా సంస్కారవందనబద్దాంజలి
పిల్లలు పెంపకమూసకలజీవైహికమే
జీవజంతుజాలంలో తోకనిమ్రింగేతలకద్దే
పవలూ రాత్రీ శిశువు స్ధ్యనా న్వేషే
కాని యవ్వనంలోకామాఛ్ఛాదిత తమకంలో
జీవి వావి వాకిలీఎంచి కమలమలమౌతుంది
తామర తంపర పరిణామమోక్షమెప్పుడు?
మనోవిపంచిక ఆలాపించే వూర్పుల సంగీతం
తమకతాళంతో దేహబంధిత యైన మనసా,
స్వతంత్రాన్ని మళ్ళీపొందాలంటే విలపించకు
నీ వరసైనసంతూ స్నేహసేన నివారిణీ నీవార
ఙ్ఞానధ్యానావాహన శాంత పరిఙ్ఞతా తోడే!
కాని విపులాచ పృధ్వీ అంటే విమలాచ సాధ్వీ
విశద విశారదాచ ధన్వీపతిః యోచిస్తే
అవింష్కరింపబడే యోగితామార్గాలే
కాని చెదిరినదారి సుగమంకావడానికి
వేసేఅడుగులన్నీ రాదారికావు
తీసే వూర్పులన్నీ అమృతమౌతాయా?
సహచర సామీప్య ఘోరవిషాకలిత
సమాజంలో చావుకి సామీప్య కవచాలేం లేవు
ప్రలోభమే పునరపి మరణాతిశయము
దారంట అంట తగులు కొన్నది అన్నంత
అమృతము అన్నమంత సంస్కృతమూ కావు
కర్మక్రియ నీ స్వీకృతులే కాని సంచితాలవ్వచ్చు
సమకాలీనతతో ఖర్మాకాలచ్చు! అందుకనే
నీ అంటురోగం నీతోనేవుంటె పోలా
కనీసం సంగమాసంగమం జంగమా జంగమం
జగన్నారాయణం అని జడభరతవి కావచ్చు!

No comments:

Post a Comment