Friday, March 13, 2026

 14 March 2018

 
Shared with Friends
నోటికి పని మాని కాళ్ళకి చెప్పులుకట్టేవారున్నారా
కాటికి పోయేలోపు ఏదైనా సాధించాలని కలగనేధీరులువున్నారా
ఏమో ఎక్కడో ఖడ్గతిక్కన్నా బాలచంద్రుడూ,తక్క మిగిలినతెలుగులు
తీరిగ్గా అరుగుల మీదకూచుని గారెలరుచి చర్చించేవారే
కరవొస్తేగానీ,బ్రతుకుతెరువూఅలోచించనిబధ్ధకస్తులేగా కనిపించేది
విద్యా అర్ధించేవాళ్ళకి వుడుకేరక్తం కాని బుధ్ధి మందం ఏమంటావూ
అందరమూ కలవాలంటే మళ్ళీ ఝంఝామారుతమోఉప్పెనో రావాలేమో
శేషూ శేషప్రశ్నలకి జవాబులునీకు తెలుసు,కానీ
అడవిలో కాచినవెన్నెట్లో పూచిన మనసున్న నీ మేధస్సు
ఏరాయలవాకిట్లోనో రాణించేదేమో,చదూకునేడప్పుడు నీరోషావేశాలనీ,
వుప్పెనవచ్చినప్పుడు చప్పున స్పందించిన శోదర సమూహాలనీ
అవును తల్చుకున్నప్పుడు ఇప్పుడుముసలైనా నెత్తురు వుడుకెత్తుతుంది
అప్పుడు చప్పుడులేకుండా విశాఖ వుక్కుకు కాలాన్ని దహనంచేశాముకదూ
ఆతర్వాత యమర్జన్సీలో వళ్ళూ వయసూ హననమైపోయాయికదూ
ఐనా గర్వించాల్సిందే సాధించారుకాబట్టి,కానీ
మన ఘనతవహించిన నేతలూ,తరవాతితరపు వుద్యోగులూ
నేతులుతాగి కల్లుతాగి ఒళ్ళుమర్చిపోయినట్లు గుర్తుకొస్తోంది
ఎందుకంటే అప్పుడే మన కళ్ళరమూతపడుతున్నయిగా
సినిమాలోహెరోలేంచేస్తారోమనకంతగా తెలీదిదివరకు
ఇప్పుడవతారమెత్తి తారాచంద్రులుప్రజను సితారావాయిస్తున్నారు
వీళ్ళుతరుణోపాయమోకాదో శసికళా చిరంజీవిచెప్పగలరు
తప్పదు సారాంశము సారాకప్పులోతేలుతుంది
చిన్నప్పుడు చాకలి తిప్పడో,తప్పుడువెధవలోసురతాగేవారు
ఇప్పుడు ఇందాకటివిద్యార్ధులూ,వుద్యోగులూ సద్యోగులూజతగూడతారు
తారురోడ్డుసిడులోతెగ కనబడతారు తింటూ తాగుతూ రేయైతేచాలు
అవునూ సురావాహినీపధకమూ,చెరోపక్క పసువిల్లోకసవిల్లో మామూలేగా
అనేకాన్వేకసంబంధగంధర్వులందరూ రాజ్యప్రభకి రాజులుకదూ,
ని రంకుశుడూ,స్వకుటుంబబంధుమిత్రసపరివారానాం మమహాకే
మనం పట్టం కట్టేస్తాము తప్పదు వాళ్ళే దైవదివారాత్రపాత్రలు
శలవు మరి పొడుగైపోతోంది చదువరులారా రాత్రికి కధకంచికి

No comments:

Post a Comment