Friday, March 13, 2026

 from the torn pages

అద్దంలో ఆత్మని వీక్షించు
అందంలో మనసుని వెతుకు
మాటల్లో చెలిమిని కలుపు
నలుగురిలో స్వగతం మరువకు
ఎడబాటు లేని అరిషడ్వర్గాలే
బతుకంటే, అవి పాకుడురాళ్ళు
ప్రాణ ప్రయాణంలో రహస్యాలన్నీ
త్రాణ నావరించే చీకటి కోణాలే
గుర్తుంచుకో గ్ఞాపకాలు తగలడేవికాదు
మూగ భాషలో దాగుండేవే
జన్మలకి గతం ఆత్మాసంగతమే
బొందితో స్వర్గానికో నరకానికో
పోదామని ప్రాణమెంచినా
ఏది యీ శరీరమాసించినా
నడిచే కాలం గడిచి పోయే వయసే
ఈరోజు రేపు కాదు ఎందుకంటే
నిన్న ముద్ర నాపై నిలిచివుండేదే
తిరిగిరాని కాలం తిరుగు లేనిది
ఖేదామోదాలు మనఃస్తితములే
వయసు మరక మనసుకుచిరుగు
ఎన్ని వోర్చు కోగలదు వెర్రి ఆత్మ
క్రొత్త జీవితానికి తత్తరపడుతుంది
ఈరోజు గరగనిది రేపైనాజరగాలి
కలలకి గాలంవేసి వెలుగున చూడు
దేముడే ముందడుగుకు తోడౌతాడు
ఆత్మ వెలుగవ్వడమే జీవికి గెలుపు
ఎన్నో బృహదాత్మలు దారి చేశాయి
కాలంచేసినా అవి వేసినసోపానాలు
నిత్య నూతన సత్య ప్రాతి పదికలు
లే మనసా సద్దులేక నిద్దుర నుండి
నీఆత్మ పసిపాప! పొత్తిళ్ళు జాగ్రత్త
గుండెకి హత్తుకు ముందడుగెయ్యి
వూపిరి లయకి ఆత్మ మనోలయమౌతుంది
మన జన్మధన్యత
మన స్వకపోల కల్పితమే

No comments:

Post a Comment