చలమచలము,ఎదుటిమనసులోకితొంగిచూసేబుద్ది,సచేలమే
కుశల మనస్కునికి,కుశాగ్రబుద్దికి,చీకటి కోణాలు దృశీభూతాలు
విశదపరిచేతీరులో విషమ స్పర్శలావేశముకారాదు
దైవ చేష్టితాలనైనా మానవబలహీనతారూపాలుకారాదు
తాపీధర్మారావు గారిరాతల్లో ప్రశ్నోత్తరాలు,ఆన్వేషణలే
విడివడినఏ మనసూ,సుడిగుండంలోకి దూకరాదు
జీవితాయ్లో అణచివేత గతకాలంలో అభిశాపమే
యోగవాషిష్ట్యము విడిచిభోగసాహిత్యంలో తడిసేమనసుకి
అడ్డుగోడలసమాజము,ఆత్మనైచ్యతనంటగిస్తుంది
మరింగంటివారికీ చలంగారికీ మూడుతరాల అనుబంధం
ఆయన రచనల ఝురీ పాతము పాత్రల జీవన సమాగమ,
నిర్గమాలు తుని నుంచి ట్రిప్లికేన్ వరకూపెనుప్రవాహమే
సమాజము అజమైనప్పుడు,వీరేసులు,కూరేసులూ
నవజాడల గురజాడ,బకించద్రుడూ,నూరుశరత్తుల,చంద్రుడూ
సున్నిత మనహ: సుమ పరిమళాలు పల్లవించినతరుణాన్నీ
సుదీర్ఘ ప్రయాణము తరవాత దారివెతుకున్న చలాని మరవలేం
మనసా మరి మరి త్రుళ్ళిపడకే చలాన్ని,కలలలో కనిపించే
ఆయన మురిపాల షిష్యుడు రామాన్ని తలుచుకు తలుచుకు
ఇదండీ sangathi, ఇక మాస్టారు చలంగారి స్మృతికి మనోనివాళులు.,
No comments:
Post a Comment