తురకల చావు పెద్దపులి
హిందువుల చావు నల్ల పాము
కిరస్తానువాడి చావు సిలువకొయ్య
మట్టికలిసేదొకటి మంటకలిసేదొకటి
మంత్రాల కర్మ ఒకరిది
తంత్రాల కూర్పు మరొకరిది
ఛావు తధ్యమైనా ముందు తెలవదు
పుటక నెలల నిండుకు తెలిసేను
నీటిలో జీవాలూ,నేలపై జీవాలూ
వేటలోబతికి,వేటలో చచ్చేవి
చావుగురించి భయపడుతూనే ఛస్తాయి
ఫాప,పుణ్యాలని హిందువులెంచుతారు.
ఫాపధుఖమేతెలుసు హిందువేతరులకు
కలలో ఫులి కనిపిస్తే,పెనుపామేకనవస్తే
మనమైతే కలచెదిరేందుకు,రామా అంటాము
ముంచుకువచ్చేమృత్యువుకూ,
పంచు వచ్చేకల తోడయ్యేనా?
పేగు తెంచుకు పుట్టే జీవికి కలమొదలయ్యేనా
కలవరపడుతూ కళ్ళునులుముకునే మనిషీ
మతమేదైనా,కలవరమొకటే సుమా
చెట్టుకు మృత్యువు చుట్టపు మనిషి.
పుట్టక మట్టే అయినా ఛెట్టుకు చావులేదు
కలలొస్తాయోలేదో,కానీ,
వసంతములో చిలక పలకరింపులతో
.కళకళ లాడుతుంది,బహుశహ
:paగలు కలగంటాయేమో.
No comments:
Post a Comment