కదిలే గురుతులు కదంబమాల
మాలతీవల సున్నిత పరిమళం
గ్ఞాపకాల దొంతరలో మబ్బులూ
మనసునిగ్రుచ్చే ముళ్ళగులాబీలూ
చీకటి రోడ్డుమీద గంతల కళ్ళతో
ఎర్ర బస్సుకోసం ఎదురుచూపులు
కాలంకదలదే, కాళ్ళకి పనిచెబితే
ఆడని డొక్కలకి చూడని మలుపులు
ఎన్ని సంగతులో మింగుడుపడనివి
నీడలు దాటే కాళ్ళు దారెంచవే
తరించడానికి దొరికినజన్మలే
ఏనిద్రో మధ్యాహ్నం దాటవేసినా
రాత్రిళ్ళు నక్షత్రాలలెఖ్ఖతెమిలేదా,
అలిసినకళ్ళు అరమూతలయ్యేను
కరువని తెలీదు బరువని యెరగము
పరువైతే వళ్ళంతా వూలికిపాటే!
నమ్మలేని నిజం అమ్మలేనికష్ఠం
గింజలకరువైతే గిన్నెలు బరువే.,
నరికేసినచింతకెంతకాపో,విన్నారుకాదు!
అమ్మేసిన తోట నెలైతె గడిపిందేమో
వళ్ళువిరుచుకు పళ్ళిచ్చే తోట
కళ్ళుకుట్టిన కాలం కళ్ళకి గంతలుకట్టింది!
తెలివితెల్లారిసంతపాలైంది
ఏవూరండీమీది, బుర్రగొక్కున్నా
పాంధుడికర్ధమయ్యే ప్రశ్నా?
ఏదారో బొమ్మో బొరుసోయెంచేరోజున
ధర్మరాజైదుగురినీ అమ్మేశాడట!
ఎవడేడుపుయెవడేడ్వగలడూ,
అదేతెలిసింది డబ్బుమారని యీరోజు
ఎవరి చావెవరు చస్తారు
తండ్రి లేనప్పుడు తల్లి బరువే
వాళ్ళకి పుట్టి ములిగిందంటే
ఎవరు తలుపుతీస్తారు
విధి యేదో రాయబోతున్నప్పుడు
గడపదాటే పాత్రకి తెలుస్తుంది
చీకటవతల తల వుండదని
నొప్పో పాడో భయంజవాబివ్వదు
అనునయం అభినయం ఐనప్పుడు
పాత్రలు ముగిసిపోవడం సత్యం!!
No comments:
Post a Comment