కన్నూ మెదలకు కాలూ కదలకు
కాసేపు, నే' నిశ్శబ్ద'ను కావలె!
కుదురుంటే గురుతౌతుందట!
తపస్వుల మనసున మంత్రం,
మరి బెసగక నిలిచేనుట!
కాలూ కన్నూ కడు దుందుడుకు.
వినువిను మనసా! నిశ్శబ్దంలో,
నీరవ నమ్ర ప్రణవం",
నాదం అనునాదం ,
ఉఛ్వాసం నిశ్వాసం,
సామజవర గానం!
నమఃపునఃనమహ.
కన్నులార చెవులార
కనుమూ వినుమూ
ఆత్మారామపు భ్రమర గీతి
అహమిక ఇహమైతే
సోహంలో పరమే స్వరం
వింటే కనుగొంటే
లోదవ్వునవెలిగేదది
పరాత్పర పరంజ్యోతే!
నానావిధ నీ చేతనలూ
ఓ మనసా కలసి నిశ్శబ్దమే
విరళీకృతమై పరిమళించేను
అవునా మరి నిస్తబ్డమవ్వవూ
No comments:
Post a Comment