maa simhaadri baava gurinchi
ఆ మొహమ్మీద మచ్హాయన ఎవరండీ
పెళ్ళిపందిరిలో ఓక పెద్ద విచారణ
ఆయనా, సిమ్హాద్రంటారులెండి
మన సీత మొగుడు అంటే బలాజీ చెరువు
కాకినాడ రంగాచార్లు గారు లేరూ,
ఆయన అల్లుడు, హార్నీ ఇంకా అర్ధంకాలేదా
పోనీ, అంగల్లు గారు తెలుసా మన
పెరీ జియ్యరు స్వామి బందువులే, ఆవిడ కొడుకు
ఖర్మ ఇంకా తెలీలేదా,పొనీ
చలకత్తాలో ఫూట్బాల్ల్ ఆడే నూజివీడు తీం తెలుసా
ఆ తీంలో గొప్ప గొల్ కీపెర్ అదేగా
ఆయనకి ఐ ఎల్ టీ డీ వుద్యోగమిచ్చిందీ,
అనపర్తిలో ఆయన ఆటంటె చెవికోసుకోని దొరలేలెరు సుమండీ
No comments:
Post a Comment