Shared with Friends
LaxmiMVగారి ప్రేరణ ఆదరణ
అమ్మా కృష్ణుడెపుడు నిద్రించును,'నిదుర',
'యది దొంగది, కనులవెంట నుండనిది'గద!
అరమూతల కనుల నిదురనూగెడి
జగముల పాలి రేడితడు,నల్లనివాడు,
నయనంబుల చాటు యంబుజాక్షులకు,
నటకు డీత డిందీవరశ్యాముడు సుమీ,
మీగడ తరకల తీపీకద,తలపె, మెరుపౌ!,
పులు కడిగిన నలుపుగద, మాయా
వికటశకట నికటుడీతడు, మునుపటి వటువె!
వెతల తలరు మతుల గతి, గద మాత!
తిరుమేనిన మెరయు లలిత మనోఙ్ఞత,
తమిన రమించెడి యాత్మ యోగుల తపమె!
తలపు తెగిన'తెలుపు' తలుపు తెరచి'నలుపౌ'
'జీర్ణవర్ణ కుల కలకల సంకుల వ్యాకులతా
తమాల' తరు విప్పిన మాయను చీరలజీరి,
జీరాడు జీమూతములద్రెంచు 'కాళీయఫణి
ఫణార్భట కేళీమోదక శిఖిపింఛమౌళి'
నిదురించునే యమ్మ, కలల కనుల,
అమ్మల యెదన, హృదయంపు లయన,
లలనల మిసిమి మనః పరిపాకమున,
సకలలోక పూరుష శాంత ధమ్మమున,
నరనారాయణ పారాయణ ధురీణతన,
తనువెమనమై, మనమెధన్యయై
చిత్తముసత్తమై, శాంతమై, అలరెడు నలపున!
నిదురించునెయమ్మ,'అధరాంచల ధరహసిత,
పరమహంస, భక్తి పరిప్లుతాతమిన నిదురించని,
సకలజీవుల నెమ్మదిన', కమ్మగ ఓయమ్మా!!
No comments:
Post a Comment