·
Shared with Friends
ఆకాశంబును కారుమబ్బుగము లాహారించె, దయ్యాలతో
ఘూకంబుల్ చెరలాడసాగినవి, వ్యాఘోషించె నల్దిక్కులన్
గాకోలంబులు, గుండె ఝల్లుమనుచున్నన్ గాని, ఇక్కాటియం
దొకల్లాడిన జాడ లేదిచట, సౌఖ్యంబెంత క్రీడించునో
చం. ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద, బై
బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె, ఆ
ముదముడిపోయినన్ సమసిపోవుట లేదిది, దీపమందు మా
హృదయము సుమ్మి! నిల్పి చనియెన్ గత పుత్రిక యే యభాగ్యయో
శా. ఆలోకించిన గుండియల్గరగు, నాయా పిల్ల గోరీలలో
నేలేబుగ్గల సౌరు రూపరియెనో, ఏ ముద్దు నిద్రించెనో
ఏ లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో
యీ లోకంబున వృద్ధి కాదగిన యే యే విద్యలల్లాడె
గుర్రము జాషువా: కోకిలపాట హంసవైదుష్యమూ, బుధ్ధదేవుని ఙ్ఞానమూ రంతి దేవుని కరుణా సరస్వతీమతల్లి వాగర్థము కలబోసి బ్రహ్మ చేసిన తెలుగుబిడ్డ!
తెలుగు భాష వ్యాకరణ, అలంకార ఛంధోబధ్ధమయ్యు ఆబాలగోపాల మనోరంజితము. వారి నోట నీ హృద్య పద్యములనంత వేదాంత జీవధారలై తెలుగుజాతి జవజీవములనుఆత్మైక్యము చేసినవి. నిజ జీవనములనుసైతము ప్రభావితము చేసినవి. సాక్షాత్తు ,కుచేల,సాందీప,శంభుదేవుల అంశల అవతారమేమో! కాళిదాసు భవభూతి, హర్షాదుల మనఃకామనలు యశశ్చంద్రికల కలదిప్పి బ్రహ్మ జన్మనిచ్చెననదగిన ఈపుణ్యభూమి తనయుడీతడు!
సమకాలీన పండితులెందరున్ననేమి విపులాచ పృధ్యీ యన్నట్లీతడు మకుటములేని కవికులశేఖరుడే! ఆళ్వారుడే! సరస్వతీమతల్లి పాండ్యరాఙ్ఞీమతల్లి వలే ఈయనను ఆళవందారని చెప్పకచెప్పెను! కవనము పాండితి ప్రకర్షలు, ఆధ్యాత్మి సత్యసౌచ శాంత సమ్యగ్ జీవన యశఃపరిపూర్తిని కలిగింపచాలవు! అది జాషువ గారి జీవిత విలాసము స్పష్ఠపరచు సత్యము! పదపదమున జాగృతి కరుణ మానవత సత్యదీక్ష నిత్యజీవన వివేకము ఇట్టి మూసన పోయగల్గిన కవులీ అవనిన లెక్కకేయుండిరి! భవభూతి నీతికోవిదతయె మన మనములకవగతము. కాళిదాసు పంచకావ్యములు పాండితి కవన కడ్గధారలే!నవరస పరిప్లుతములే, వెలుగు చుక్కలే, . హర్షుని కావ్యములవి కరుణా రస సిఖరులు! బాణ, హాస కవులు రసైక కావ్యస్రష్ఠలౌట జగద్విదితము. షేక్స్ పియరూ, మిల్టనూ హోమరూ వర్డ్స్ వర్తూ యిత్యాదుల నిట నుటంకించుట భావ్యమయ్యూ సమరసభరితవేదాంత పుష్ట జనపద నగర బుధ్ధిజీవులనూ, పాతకొత్తతరములనూ దేశకాలపాత్రతలనూ ఒకమూసన పోసినకవన కధా కేసరులరులీ భరత దేశపు బిడ్డలే! భారత భాగవతములీ పుణ్యగడ్డ ప్రసవించిన మహోదాత్త చారిత్రిక పురాణ శాస్త్రగ్రంధములు! ప్రపంచమున వీటికివియేసాటి! అనేక నదులకవలంబనయైన హిమవత్ పర్వతములవలెనివి సజీవములు! ఇందలి వస్తువిషయములత్యంతరమణీయములు. మేలిమి బంగరునత్యుత్తమ నగగ తీర్పుచేసిన గుర్రముజాషువ మన అభినవ పోతన, నన్నయ తిక్కనల వారసుడు!కాళిదాసు కృపగలవాడు! భవభూతీ స్పృహగలవాడు! అశోకుడుకాదు గాని సిధ్ధార్ధుడే!!
Krishnamacharyulu Maringanti
No comments:
Post a Comment