here is a garden in every mind say's chadwick
and there are weeds always known or unknown
but who dares to prune them unless you yourself
evil prevails over good but for a straw in the stream
that your both eyes see and single mind catches up
దారులు చీలుతోనే వుంటాయి,
గమ్యం తెలిస్తే గమనము చెడదు
వెయ్యి కళ్ళున్నా ఒక్క బుద్ది కావాలి
బుద్ధి కోరికల కవల వుంటుంది సుమా
దారంటే ఎటు పంచప్రాణాలూ పల్లవించేదేనా
నీ దేహం ఆర్తితో అల్లాడిపోయేదా
కామ్యక వనములోకా
కరుణావీక్షణలతో ఆర్ద్రమైనదా
పుష్యరాగ ప్రవాళకాంతులతో వెలిగిపోయేదా
ఒకటి కలలలో ద్యోతకమైతే
ఒకటి కలలంతా పరచుకొని
పగలూమనసు ముసుగులోంచి తొంగిచూసేది
ఏమీ రెండు చీలికలొచ్చాయా
ఏదో అయోమయమా, అప్పుడు ఒకింత విశ్ర మించు
నిర్ణయము తీసుకోకు! తీరికగా
మనసు కోరికలూ విడదీయి
అంతరాత్మా ఎది నీ మనోగ్జతా
అని అడిగిచూడు, కామితార్ధమా
కన్నులకవల గోచరమయ్యే
జీవిత పర్మార్ధమా ఎంచుకో
అని తప్పక చెబుతుందీ
ఇక నీ ఖర్మము నీకు నువ్వు మిగిలేవా
అద్రుష్టమే అంతరార్ధాన్ని వి డు వవు
లేపోతే ఈకంపు జన్మలు మళ్ళీ మళ్ళీ తధ్యం
No comments:
Post a Comment