ప్రతి వీక్షణమూ మనోదర్పణ శోషితమే
ప్రతి వీక్షణమూ మనోదర్పణ శోషితమే
ప్రతి క్షణమూ బుద్భుధ విస్ఫోఠనమే
కాల పరిత్యాగంలో ఖడ్గఛాలనం
దిక్కుల చుక్కలతోరణంలో
దిగంతాల వెంటవూగిసలాడే
దివంగత ఆత్మలద్యుతి
ఉల్కా శకల సకలం!
పైనించి తలక్రిందులాకాశం
క్షతానక్షత్ర విచిత్రం
ఏది పగలు ఏదిరాత్రి దిగంతాల పరివ్యాప్తిలో?
ఏది సత్యమేదిమిధ్య మస్తిష్కపు వితర్క మధనంలో?
No comments:
Post a Comment