Shared with Friends
అప్పుడే గతము మరొక నిలువు లోతైపోయింది.
కొట్టుకునేగుండె చప్పుడు వూపిరి వూర్పులకి
విలవిలలాడుతోంది. మతీ గత కాలపు శృంఖల త్యాగం సంగతేమైందీ!!! మరిన్ని సవరణలు కానవస్తున్నాయి కదూ! దూరమని యెంచక తిరుగు ప్రయాణం భారాయాస న్యాసమనీ అనుమాననించక స్పృహా భిశనివేశవి కావలె!! సమయము సంక్షిప్త గుప్తము. కరుగుతుంది కాని కనరాదు!! అద్వైత భాష్యమో ద్వైత భావమో దారి చూపవచ్చు!మెలకువ కదా జీవస్పృహ!!
చూసేకనుపాపల్లారా, మీదృశాచాపాన్నెకుబెట్టిందెవరోతెలుసా
కనలేనిేకర్ణద్వయమా,ప్రతిపదార్ధాము చేరేదెవరికోతెలుసా
ఓ గహ్వాంతరజిహ్వా,రుచిరార్ధాలనివిచక్షించేదెవరోఎరికేనా
స్వయం నవమౌక్తికనాసికా,నీఘ్రాణాగ్రహణమెవరికోసమోఎరికయేనా
పరపరాగచోదకీ స్పర్శా నీవిద్యుల్లతాఛాలనమెవరిదోతెలియునా
అవును,ప్రాణమే,మాచేతనక్రియాకారకోద్దేశ్యము,
అయ్యో,నేప్రాణిని,నాప్రయాణము,కాలమానానుగతయే
నే నిక్షిప్తము,నేవివిధను,అణువణువునతొణికిసలాడెడిప్రత్యంగిరనే
మనసు నన్ను నడిపించును,విడిపించును
జ్ఞానేంద్రియవిసంకల్పిత కొన్నికోటులకణజీవములము
స్వపరాగత్రుణములము,కలసి వెరసి ప్రాణమండ్రుమమ్ము
మనసొక్కేటెమమ్ము నిక్షింపగలదురాలిపోవుదము,శుష్కించి
అవును,నేమనస్సును,నాకుజీనాశ్రయములు జ్ఞానేంద్రియములు,
నన్ను కలదిప్పి,కలుషములొ,కలితార్ధములొ కల్పించెడిది కామన
కాదు నన్నుకోరికయనియన్నను,నేనహంకృతికి శృతిని,మాత్రము
యేమి అహంకారమును తులువనుకాదు వలువను,
అరిషద్వర్గములకాద్యను విలువల వివరము తెలిసినతొలగి చనెద
ఆత్మానుగత జ్ఞానమునందు,నిత్యమౌ హంకారమును
వూపిరి యందు నిలచి మెలగుదు ప్రహేళిక ముగియువరకు
చేతనాచేతక విమర్శ నన్ను మనసుకున్న వన్నెగ నెన్నినను
స్వీకృతినొందినమనసా,విప్పుము నీవిమలకోమల స్పృహ నీకై
సాధు,సాధు నననిశము పున్నామలోకముననిలువ
తులువనయ్యు,నిజముభయమునకు భ్రాంతినొందుదు
అమృత భావనతపముచేనొంద భయభ్రాంతనౌదు
తపము,పరితాపమని,నారూప ప్రపత్తిని కోరుదు నిత్యము
కాని పునరపి జననప్రమేయము,తెగినతుది ఆత్మప్రస్తుతి నెంచెద
విచక్షించిన బ్రహ్మవిద్య స్వయ్సంసాధకయోగము కదా విచారమేల
ఆత్మాశ్రయనై, వుచ్వాశ నిశ్వాసముల హంసగీతి పాడెద
తారక నామ స్పృహన,రామ పరమ పావవ స్మరణన,ఆత్మ చేతనమున
No comments:
Post a Comment