Shared with Friends
కాకమ్మలెక్కువ్వ ఇక్కడ కర్రలిళ్ళూ ఎక్కువే
పిచికమ్మలు తక్కువే పిడకలిళ్ళూ తక్కువే
మేడపై ఉంచి చోద్యం చూసేవాళ్ళులేనేలేరు
నీడలిచ్చేవూడలమర్రులేలేవంటే అశోకవాటికకాదిది.
అంతర్యుద్దం స్వాతంత్రము తెచ్చినా శాంతిపావురాలు ఆవాసముకోసము నీడవెతుక్కుంటూనే ఉన్నాయి
నేలంతా మాదే మాశాంతి మంత్రాలు మేమే పాడుకుంటాము
లేదా శాంత మహాసముద్రం నుంచి వలేసిపట్టుకుంటాము
వలస పిట్టల్లారా పో,పోండి,మాగూళ్ళు మేమేకట్టుకుంటాము
రసాతలంలోరావణాసురుడి చుట్టాల తీరిదండీ
సరే మనమేమన్నా తక్కువతిన్నమా
మనవూళ్ళల్లో తిన్నిణ్టివాసాల్లెక్కెట్టమూ
మనవాళ్ళనే మనం దోచుకోమూ
అయ్యిందేమోఅయ్యింది,ఇంటికెళ్ళి
వంటికిమనసుకూ పనిచెబుదామా?
No comments:
Post a Comment